హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక చర్చలు..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ బుధవారం రాత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలతో పాటుగా రాజకీయ పరిణామాలపైన చర్చ జరిగిందని సమాచారం.
ఈ నెలలో సీఎం జగన్ 15 రోజుల వ్యవధిలో హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవ్వటం ఇది రెండో సారి. అటు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే గవర్నర్ తో సుదీర్ఘ భేటీ.. ఇప్పుడు అమిత్ షా తో సమావేశం ద్వారా సీఎం జగన్ సమావేశాలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంలో సీఎం జగన్ ప్రధానంగా రాష్ట్రంలోని ఆర్దిక- రాజకీయ పరిస్థితులపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు తానే పూర్తి చేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్..దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధుల సాధన కోసం వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు అమిత్ షాతో జరిగిన సమావేశంలోనూ పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరారు. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని కోరినట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్ధారించటంతో..ఆ మొత్తాన్ని విడుదల చేయాలని సీఎం జగన్ కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు.
తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, వీటిని ఇప్పటించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసారు. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడంవల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది.
ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్రం ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టిపెట్టాలని కోరారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని సీఎం కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications