గవర్నర్‌తో జగన్‌ దంపతులు భేటీ- దీపావళి శుభాకాంక్షలు- అసెంబ్లీతో పాటు కీలకాంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ విరామం తర్వాత గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌తో విజయవాడ రాజ్‌భవన్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా భార్య భారతితో కలిసి గవర్నర్‌తో జగన్‌ సమావేశమయ్యారు. ముందుగా జగన్ దంపతులు గవర్నర్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.

cm jagan met governor harichandan with his wife, dicuss key issues after diwali greetings

అనంతరం గవర్నర్‌ హరిచందన్‌తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి గవర్నర్‌కు జగన్ వివరించారు. త్వరలో అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల గురించి కూడా వీరిద్దరూ చర్చించుకున్నారు. మూడు రాజధానుల ప్రక్రియపై జరుగుతున్న న్యాయపోరాటం, ఇతరత్రా అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్ధితులతో పాటు ఇతర అంశాలపైనా వీరు చర్చించుకున్నారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు జగన్‌ వివరించారు. డిసెంబర్‌ మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గవర్నర్‌కు సీఎం సమాచారం ఇచ్చారు.తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. అలాగే వీసీల నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఫైల్ ప్రభుత్వం నుంచి వచ్చి చాలా కాలమవుతున్నా గవర్నర్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విషయంలో ఇటీవల కేంద్రంతో జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం జగన్ గవర్నర్‌కు వివరించారు. అలాగే ఈ నెలాఖరున శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలు, ఏయే బిల్లులు ప్రవేశపెట్టేది తదితరవాటిపై ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించినట్లుగా తెలియవచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కరోనా, ఇతర అంశాలపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

cm jagan met governor harichandan with his wife, dicuss key issues after diwali greetings

కరోనా కొనసాగుతున్న తరుణంలో కేబినెట్ విస్తరణ నిర్వహించిన సీఎం జగన్‌ అప్పట్లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇదే తొలిసారి కావడంతో జగన్‌, గవర్నర్‌ దంపతులు పరస్పరం యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. కరోనా సందర్భంగా దీపావళి జరుపుకోవాల్సి రావడంతో ఎదురవుతున్న పరిస్ధితులపైనా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అరగంటసేపు సాగిన భేటీ తర్వాత జగన్‌ దంపతులు తిరిగి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+