త్వరలో మిగిలిన పోర్టులు -గత ప్రభుత్వానిది మోసమే : మద్దతుగా నిలవాలి -సీఎం జగన్..!!
రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు అదనంగా..త్వరలో మరో నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. రామాయపట్నం పోర్టు భూమిపూజ చేసిన సీఎం జగన్.. ఈ పోర్టు రావటం ద్వారా ఆర్దికంగా యాక్టివిటీ పెరుగుతుందన్నారు. రూ 3740 కోట్లతో సిద్దం చేస్తున్న ఈ పోర్టు ద్వారా మూడు నుంచి నాలుగు వేల మందికి ఉపాధి అకవాశం దొరుకుతుందన్నారు. పరోక్షంగా చాలా మంది లబ్ది జరుగుతుందని వివరించారు. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు.

పోర్టులో 75 శాతం స్థానికులే ఉద్యోగులు
పోర్టులో 75 శాతం స్థానికులే ఉద్యోగాలని మరోమారు వేదిక నుంచి స్పష్టం చేసిన సీఎం జగన్.. ఆ చట్టం తెచ్చిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు. త్వరలోనే మిగతా వాటికి భూమి పూజ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. అధికారంలో ఉన్న అయిదేళ్లు ఏమీ చేయకుండా.. సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి టెంకాయ కొట్టి శంకుస్థాపన అని చంద్రబాబు ప్రకటించుకున్నారని సీఎం జగన్ దుయ్య బట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టిందన్నారు.
గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఇదే తేడా
భూ సేకరణ, డీపీఆర్ లేకుండానే శంకుస్థాపన హడావిడి చేసిందని, కానీ, తమ ప్రభుత్వం అన్ని క్లియరెన్స్‌లతో పక్కాగా ముందుకు సాగుతోందని.. ప్రజలు ఇది గమనించాలని సీఎం జగన్ కోరారు. మరో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీ లో ప్రతీ యాభై కిలోమీటర్లకు ఓ పోర్టు.. లేదా ఓ ఫిషింగ్ హార్బర్ కనిపించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు ప్రకటించారు. కొత్త పోర్టులు ద్వారా లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుతాయన్నారు. పోర్టుకు కావాల్సిన భూసేకరణ పనులు కూడా దాదాపు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు.

మద్దతుగా నిలవండి. .ఆశీర్వదించండి
రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయన్నారు. పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్ కూడా తీసుకు వస్తామని సీఎం ప్రకటించారు. పోర్టుకు అనుసంధానంగా బైపాస్ రోడ్డుల నిర్మాణం చేపడతామన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన చేసి గత ప్రభుత్వంలోని పెద్దలు మోసం చేసారని..రైతులు - మహిళలను సైతం రుణ మాఫీ పేరుతో మోసం చేసారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా అడుగులు వేస్తమన్నారు. తాము నిబద్దతతో చేస్తున్న పాలనకు మద్దతుగా నివాలని సీఎం జగన్ కోరారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications