విశాఖ కేంద్రంగా వైఎస్ జగన్ కొత్త ప్లాన్: గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరార్
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే కార్యక్రమాలు మరింత వేగవంతం అయ్యాయి. కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ- ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయట్లేదు. అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించే పనులను వాయిదా వేస్తూ వస్తోందే తప్ప దానికి పుల్‌స్టాప్ పెట్టట్లేదు.
విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. హైకోర్టుల్లో పలు పిటీషన్లను వేసింది. అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన ఉద్యమానికీ సారథ్యాన్ని వహించింది. తెలుగుదేశం పార్టీ సృష్టించిన అడ్డంకుల వల్ల విశాఖకు సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాలను తరలించడంలో జాప్యం ఏర్పడుతూ వచ్చింది.

వాటన్నింటినీ అధిగమించి ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్యాంప్ కార్యాలయాన్ని తరలించడానికి ప్రభుత్వం తన చర్యలను మళ్లీ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టింది. క్యాంప్ కార్యాలయం తరలింపు పనులను పర్యవేక్షించడానికి, వీటిని మరింత ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే జీవో నంబర్ 2015ను విడుదల చేసింది.
మున్సిపాలిటీ- పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇందులో సభ్యులు. క్యాంప్ కార్యాలయ తరలింపు ఏర్పాట్లన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. క్రమంగా- అన్ని శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయి. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విశాఖకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకుడు లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2015 జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రుషికొండ వద్ద ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణ పనులతో పాటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవంపై స్టే ఇవ్వాలని కోరారు.
కాగా- డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంప్ కార్యాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన గృహ ప్రవేశం చేయాలని వైఎస్ జగన్ తాజాగా నిర్ణయించారు. విశాఖ క్యాంప్ కార్యాలయం కేంద్రంగానే ఆయన భవిష్యత్ రాజకీయాలు ఉండబోతోన్నాయి. ఆయన ఎన్నికల పర్యటనల షెడ్యూల్స్ అన్నీ అక్కడే ఖరార్ కానున్నాయి.
-
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications