చంద్రబాబుకు బాగా తెలుసు, తేల్చే సమయం - సీఎం జగన్ పిలుపు..!!

ముఖ్యమంత్రి జగన్ మరోసారి చంద్రబాబు..పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పాలనలో దోచుకోవటమే జరిగిందని..నాటి ప్రభుత్వంలో ఈ తరహాలో మంచి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. తనకు చంద్రబాబులా దుష్ట చతుష్టయం మద్దతు లేదని చెప్పారు. దళారీ వ్యవస్థ కావాలా..పేదల ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలని సీఎం సూచించారు. మంచి జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు.

రైతుల ఖాతాల్లో నగదు జమ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ 2022-ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని చెప్పారు. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

CM Jagan

ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లుగా వెల్లడించారు. తన ప్రభుత్వంలో రూ 7,802 కోట్లు రైతు భరోసాగా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు. గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి సేవలు అందిస్తున్నామని చెప్పారు.

చంద్రబాబు చేసిందిదే
కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని సీఎం పేర్కొన్నారు. విత్తనం మొదలు పంట అమ్మకం​ వరుకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగినా ఆ సీజన్‌ ముగియక ముందే పరిహారం అందిస్తున్నామని చెప్పారు. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నామని వివరించారు.

సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉందని సీఎం వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని గుర్తు చేసారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు, ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశామన్నారు.

CM Jagan

తేల్చుకోవాల్సిన సమయం
రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం​ చేసుకున్నామని చెప్పారు. మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా.. లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా అని సీఎం ప్రశ్నించారు. రైతు రాజ్యం కావాలా.. రైతులను మోసం చేసే పాలన కావాలా.. ఆలోచన చేయాలని సూచించారు.

రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా.. దళారీ వ్యవస్థ కావాలా అని పేర్కొన్నారు.పేదల ప్రభుత్వం కావాలా.. పెత్తందారుల ప్రభుత్వం కావాలా ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని.. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారని సీఎం చెప్పుకొచ్చారు. నైతికత లేని వ్యక్తి చంద్రబాబు అని..వీళ్లలా తనకు అబద్ధాలు చెప్పడం రాదని సీఎం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+