ఏపీలో రైతులకు సంక్రాంతి కానుక ..నేటి నుంచి ఖాతాల్లో జమ
Recommended Video
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలోని రైతులకు సంక్రాంతి కానుక ఇవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన అన్నదాతలకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా క్రింద ఖాతాల్లో జమ చేస్తానని ప్రకటించిన రూ.2 వేలను గురువారం నుంచి వారి ఖాతాలకు నేరుగా బదిలీ చెయ్యనుంది వ్యవసాయ శాఖ. సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చెయ్యనున్నారు .
వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం క్రింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసింది ఏపీ సర్కార్ .అయితే మిగతా రెండు వేలు కూడా సంక్రాంతి కానుకగా ఖాతాల్లో జమ చేస్తుంది సర్కార్ . ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందుకున్న లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లోఉన్నప్పటికీ రైతు భరోసా అందిస్తున్నామని చెప్తోంది వైసీపీ సర్కార్ .కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి అందిస్తోంది. ఇక మూడు విడతలుగా అందిస్తున్న ఈ ఆర్ధిక సాయంలో ఇప్పుడు చివరి విడతగా 2000 రూపాయలను ఖాతాలలో జమ చేసి పండుగ చేసుకోమంటుంది ఏపీ సర్కార్ .












Click it and Unblock the Notifications