సీఎం జగన్ చలించిపోయారు: ఆ చిన్నారులను చూడగానే ఇలా : 15 లక్షల మంజూరు..!
తిరుపతిలో ఆ చిన్నారులను చూడగానే ముఖ్యమంత్రి జగన్ చలించిపోయారు. ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన కోసం రేణిగుంట ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనకు ఇద్దరు బాలికలు మా అన్నకు ప్రాణబిక్ష పెట్టండి అంటూ బోర్డులు పట్టుకొని కనిపించారు. వారిని చూడగానే జగన్ వారి వద్దకు వెళ్లారు. వారి వివరాలు ఆరా తీసారు. ఆ ఇద్దరి అమ్మాయిల కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. వారి సోదరుడికి ఏం జరిగిందో..అసలు సమస్య ఏంటని విచారించారు. వారు చెప్పిన సమాచారంతో సీఎం జగన్ చలించారు. వెంటనే వారికి సాయంగా పది లక్షలతో పాటుగా వారి భవిష్యత్ చదువుల కోసం మరో అయిదు లక్షలు అక్కడికక్కడే మంజూరు చేసారు.
రేణిగుంట ఏయిర్ పోర్టులో ఆ చిన్నారులు..
సీఎం జగన్ తిరుపతి వస్తున్నారని తెలిసి.. తమ బాధ చెప్పుకుందామని.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చాందినీ, రజనీ అనే ఇద్దరు అమ్మాయిలు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిని కలిసేందుకు తమ బాధ చెప్పుకోవటానికి చేతిలో బోర్డులో పట్టుకొని..వాటి మీద మా అన్నకు ప్రాణ బిక్ష పెట్టండి అని రాసి ఉంది. అది చూడగానే జగన్ వారిని వాకబు చేసారు.
విమానాశ్రయం వెలుపల ఏర్పాటుచేసిన గ్యాలరీలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి.. తమ అన్నకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకున్నారు. వారి సోదరుడు హరికృష్ణ తిరుపతి రవీంద్రభారతి స్కూల్‌లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్ 21న స్కూల్ సిబ్బంది భవనం పైనుంచి కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు.. చెన్నై ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి..అంటూ అని చాందిని, రంజని సీఎంను అభ్యర్థించారు.

చలించిన సీఎం వెంటనే మంజూరు..
వారి ఆవేదన విని సీఎం జగన్ చలించిపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఓదార్చి.. వారి సోదరుడు హరికృష్ణ వైద్య ఖర్చుల కోసం 10 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆ పిల్లల చదువులకు మరో 5 లక్షల రూపాయలు కేటాయించాలని ఆదేశించారు. పుట్టెడు కష్టంతో వచ్చిన ఆ ఇద్దరు అక్కాచెలెళ్లను ఆదుకోవటంతో వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు.
వారిద్దరే కాదు.. విమానాశ్రయం ముఖ్యమంత్రి.. గ్యాలరీలో ఉన్న అందరి వద్దకు వెళ్లి ఒక్కొక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అర్జీలను జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తాకు అందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో ఇదే విధంగా విశాఖ విమానాశ్రయం వద్ద స్థానిక ఐటీ యువత తమ సహచర ఉద్యోగి బ్లక్ కేన్సర్ తో బాధ పడుతున్న విషయాన్ని సీఎంకు వివరించి ఆర్దికంగా సాయం చేయాలని కోరగా..జగన్ అక్కడికక్కడే పది లక్షలు మంజూరు చేసారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications