సీఎం జగన్ సీరియస్‌ - సహించేది లేదంటూ హెచ్చరిక..!!

ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఆక్వా రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ అక్వా రైతులకు ప్రోత్సాహకంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్‌ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్‌ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందేలా నిర్ణయించారు. తాజాగా, ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్‌ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేసారు.

వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతుల ఫిర్యాదు లో సీఎం కు వివరించారు. ధరలు పతనమై నష్ట పోతున్నామన్న రైతులు వాపోయారు. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు చేసారు. తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వెంటనే అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

CM JAgan Serious, Appointed Cabinet Committee on Aqua farmers issues

ఇందుకోసం వెంటనే సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశించారు. వారంరోజుల్లో నివేదిక అందించాలని సీఎం స్పష్టం చేసారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీదిరి అప్పలరాజు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు విజయానంద్‌, పూనం మాలకొండయ్య, కన్నబాబు ను సభ్యులుగా నియమించారు. ఆక్వా రైతుల ఆదాయం పెరిగేందుకు కేజ్, మరీ కల్చర్‌పై దృష్టి పెట్టాలని సీఎం నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+