వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీబీ పనితీరుపై సీఎం ఆగ్రహం: అధికారుల తీరు సరిగ్గా లేదు: లంచం అంటే భయపడాలి..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో అవినీతి నిరోధక శాఖ పనితీరు పైన ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆశించిన రీతిలో పని తీరు కనిపించటం లేదని ముఖ్యమంత్రి అసమనం వ్యక్తం చేసారు. గతంలోనే తాను ఏసీబీ మరింత యాక్టివ్ గా పని చేయాలని..మరింత సిబ్బందితో ఎక్కడ అవినీతి జరగకుండా చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పినా..ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో లేవన్నారు. ఏసీబీలో పని చేస్తున్న సిబ్బంది కి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేసారు. తాను మరో నెల రోజుల్లో తిరిగి సమీక్ష నిర్వహిస్తామని..అప్పటిలోగా పూర్తి మార్పు రావాలని..మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్రం లో ఎవరూ అవినీతి బారిన పడకూడదని సీఎం వ్యాఖ్యానించారు.

మరో హామీ నెరవేర్చే పనిలో జగన్: సమగ్ర భూముల రీసర్వేకు ఏపీ సర్కార్ శ్రీకారం మరో హామీ నెరవేర్చే పనిలో జగన్: సమగ్ర భూముల రీసర్వేకు ఏపీ సర్కార్ శ్రీకారం

ఏసీబీ సిబ్బందిలో అలసత్వం సహించను..
ఏసీబీ పని తీరు పైన ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏసీబీ పని తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా..క్రియాశీలకంగా అంకిత భావంతో పని చేయాలని సీఎం నిర్ధేశించారు. తాను గతంలో నిర్దేశించినా..ఆ స్థాయిలో పనితీరు కనిపించటం లేదని సీఎం అసహనం వ్యక్తం చేసారు. ఏసీబీ సిబ్బంది పైన కీలక బాధ్యతలు ఉన్నాయని.. వారికి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేసారు.

CM Jagan serious on ACB officials and warned them to to be active in duties

అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని సీఎం చెప్పుకొచ్చారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలని నిర్ధేశించారు. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.

ఎక్కడా అనివీతి కనిపించకూడదు..
ఏపీలో ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. ఎమ్మార్వో కార్యాలయాలు.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు.. టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో ఎక్కడైనా లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని సూచించారు. సెలవుల్లేకుండా పనిచేయండి.. మూడు నెలల్లోగా తనకు మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి గట్టిగా ఆదేవించారు. కావాల్సినంత సిబ్బందిని తీసుకోండని వారికి అనుమతి ఇచ్చారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. తాను మరో నెలరోజుల్లో సమీక్ష చేస్తానని అప్పటిలోగా మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు.

English summary
CM Jagan serious on ACB officials in official review. CM directed ACB to be active and take additional staff to control corrption in govt offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X