• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి : జగన్ సీరియస్ రియాక్షన్ - బైపోల్ : ఆ తరువాత..!!

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ పార్టీలో ఎవరు హద్దు మీరినా..ఎలా ఉంటుందో తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పష్టం చేసారు. కేబినెట్ విస్తరణ..కొందరు సీనియర్లు అలకలు..అనుచరుల నిరసనల విషయం వరకు సీఎం జగన్ వాటిని క్షణికావేశంలో ఎదురైన పరిణామాలుగా భావించారు. కానీ, మాజీ మంత్రి ఒకరు రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం ఇవ్వటంతో..జగన్ నుంచి వచ్చిన స్పందన చూసిన తరువాత పార్టీ ముఖ్య నేతలు సైతం విస్తుపోయారు.

జగన్ ఎంత సీరియస్ గా ఉన్న విషయంతో పాటుగా.. ఆ సీనియర్ నేత నియోజవర్గం పై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందీ వివరించారు. దీంతో..ఆ మాజీ మంత్రి..సీనియర్ నేత దిగి రాక తప్పలేదు. బయటకు వచ్చి తామంతా జగన్ టీం సభ్యులమని..తమకు జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని అమలు చేస్తామంటూ సీఎం ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీ ముఖ్యుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

పదవి రాకపోవటంతో..రాజీనామా అల్టిమేటం

పదవి రాకపోవటంతో..రాజీనామా అల్టిమేటం

తాజాగా కేబినెట్ విస్తరణలో భాగంగా సీఎం జగన్ 11 మంది మాజీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. అందులో తమకు అవకాశం దక్కక పోవటంతో కొందరు సీనియర్ మంత్రులు అలక బూనారు. రాజీనామా చేస్తామంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేబినెట్ విస్తరణకు దూరంగా ఉన్నారు. అంతకు ముందే సీఎం జగన్ వద్దకు వారి రాజీనామా ఆలోచనలు..అనుచర నేతలు ఆ మాజీ మంత్రితో భేటీ అయ్యారు.

కొందరు ఎమ్మెల్యేలు సైతం ఆ సమావేశానికి హాజరయ్యారు. వారిలో ఒకరిద్దరు సైతం ఆ మాజీ మంత్రికి మద్దతుగా రాజీనామాలకు సిద్దమని చెప్పటం పైన పార్టీ ముఖ్య నేతల ద్వారా సీఎంకు సమాచారం అందింది. దీంతో..ఒక్క సారిగా సీఎం సీరియస్ అయ్యారు. వారికి అప్పటికే నచ్చ చెప్పిన పార్టీ మఖ్యనేత వారితో జరిగిన చర్చల వివరాలను సీఎం కు వివరించారు. అయినా..అదే పంతంతో ఉన్నారని ఆ ముఖ్యనేత సీఎంకు వివరించారు.

ఒత్తిడికి లొంగొద్దు..బైపోల్ కు వెళ్దాం

ఒత్తిడికి లొంగొద్దు..బైపోల్ కు వెళ్దాం

దీంతో..కోస్తా జిల్లాలకు చెందిన ఆ మాజీ మంత్రి పైన సీఎం వెంటనే రియాక్ట్ అయ్యారు. రాజీనామా వెంటనే పంపమని చెప్పండి.. అదే విధంగా వెంటనే ఆమోదించేలా నిర్ణయం తీసుకుందాం. తరువాతి సంగతి తరువాత చూద్దాం. ఉప ఎన్నికకు వెళ్దాం అంటూ సీఎం అనటంతో అక్కడ ఉన్న పార్టీ సీనియర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

తమకు ఒక్క సారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని..అప్పటికీ వినకుంటే అదే నిర్ణయం తీసుకుందామని నచ్చ చెప్పారు. దీంతో..సీఎం సరే అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఆ మాజీ మంత్రికి సీఎం ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో వివరించారు. ఫలితంగా మాజీ మంత్రి సీఎం క్యాంపు కార్యాలయానికి రావటం..సీఎంతో సమావేశం కావటంతో సమస్య పరిష్కారం అయింది. అదే విధంగా.. అనుచరులు క్షణికావేశం లో చేసిన ఆందోళనలు.. పదవులు దక్కని వారు వెనుక ఉండి చేయించిన నిరసనల గురించీ సీఎం ఆరా తీసినట్లు సమాచారం.

పార్టీ - వచ్చే ఎన్నికలు ముఖ్యం..

పార్టీ - వచ్చే ఎన్నికలు ముఖ్యం..

సామాజిక సమీకరణాల వలన పదవులు ఇవ్వలేకపోయిన వారికి ఖచ్చితంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని సీఎం చెబుతూ వస్తున్నారు. పదవులు దక్కలేదనే కారణంతో సమస్యలు క్రియేట్ చేస్తే మాత్రం సీరియస్ నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలు సీఎం కీలక నేతల ద్వారా స్పష్టంగా ఇచ్చినట్లు తెలిసింది.

దీంతో..సీనియర్లు అంతలా బయట ఆవేదన వ్యక్తం చేసినా..సీఎంతో భేటీ తరువాత మాత్రం కూల్ అయిపోయినట్లుగా బయటకు వచ్చి..సీఎం జగన్ తమకు ఏది చెబితే అదే ఫాలో అవుతామంటూ చెప్పుకొచ్చారు. అలకబూనిన నేతల విషయంలో హద్దు దాటిన వారి విషయంలో మాత్రం సీఎం సీరియస్ గానే స్పందించారని తెలుస్తోంది. ఇప్పుడు మంత్రులు తమ శాఖల బాధ్యతలు స్వీకరణ సమయంలో ఈ అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీలో ఈ వ్యవహారాలు ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.

English summary
Former Ministers from coastal districts who threatend to resign was given a sweet warning by CM Jagan .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X