మంగళగిరిలో అభ్యర్థిని మార్చేస్తున్న జగన్...నారా లోకేష్‌పై ఎవరు ఊహించని వ్యక్తి బరిలోకి.. ?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ప్రజాక్షేత్రంలో తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీని ఓడించాలని టీడీపీ, జనసేన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.మరోసారి అధికారం చేపట్టి, ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని ఇటు వైసీపీ కూడా భావిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరి వ్యూహాల్లో వారు పూర్తిగా నిమగ్నమైయ్యారు.
ఒక వచ్చే ఎన్నికల్లో పలువురు నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన ప్రజల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..2024 ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అని ఆరా తీస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేకపోయినప్పటికీ , మాజీ మంత్రి నారా లోకేష్ రాబోవు ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన, నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

2024 ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసి సత్తా చాటుతానని నారా లోకేష్ సవాల్ చేశారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ తిరిగి పోటీ చేస్తుండగా, ఆయన్ను ఓడించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు బరిలో ఉంటారా అనే అనుమానం నెలకొంది. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందని పార్టీ అధిష్టానం గుర్తించింది. దీనికితోడు..రెడ్డి సామాజికవర్గం ఆళ్ల మీద కొంత అసంతృప్తితో ఉన్నారు.

ఇటీవల జరిపిన సర్వేల్లో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనకపడటంతో.. నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఉందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని నారా లోకేష్ మీద పోటీ చేయించేందుకు జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజీ చిరంజీవితో పాటు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మంగళగిరి నుంచి రేసులో ఉన్నారు.
వీరిద్దరితో పాటు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు కూడా మంగళగిరి సీటును ఆశిస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. మంగళగిరిలో చేనేత వర్గాలు ఎక్కువుగా ఉండే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే.. నారా లోకేష్‌ను ఓడించడం సులభం అవుతుందని వైసీపీ అధినేత లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి చినబాబును గెలిపించేలా వ్యూహాలు పన్నుతున్నాయి. నియోకవర్గంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధాకు అప్పగించారు.

వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా ప్రణాళికలు రచిస్తుంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ విజయం కోసం పార్టీ నాయకులకు గట్టిగానే శ్రమిస్తున్నారు. మంగళగిరి నియోకవర్గం నుంచి టీడీపీ తరుఫున నారా లోకేష్ పోటీ చేయడం ఖాయం కాగ, అధికార పార్టీ నుంచి ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాపట్ల నియోజకవర్గం బరిలో ఉంటారనే టాక్ వైసీపీలో వినిపిస్తుంది. దీనిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications