విశాఖ కేంద్రంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

విశాఖే పరిపాలన రాజధానిగా చర్చ సాగుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.

విశాఖే పరిపాలన రాజధానిగా చర్చ సాగుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ పై సీఎం జగన్ ప్రాధమిక సమావేశం నిర్శమించారు. మెరుగైన పారిశ్రామిక పాలసీ ఖరారు దిశగా అధికారులకు సూచనలు చేసారు. న్యూ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీలో మార్కెటింగ్‌ టై అప్‌ విధానంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అడ్వైజ్, అసిస్ట్‌ అండ్‌ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని మంత్రులు పదే పదే చెబుతున్న వేళ..ఇదే సమీక్షలో సీఎం విశాఖ కేంద్రంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

నూతన పారిశ్రామిక పాలసీ ఏర్పాటుకు సంబంధించిన చర్చలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం అధికారులకు మార్గదర్శం చేసారు.అందులో భాగంగా.. స్టార్టప్‌ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం ప్రకటించారు. అదే సమయంలో విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్‌ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్‌ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని సూచించారు.

CM Jagan suggested officials to encourage startups in Vizag, given directions on new industrial policy

అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ టైఅప్‌ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్‌ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. అడ్వైజ్, అసిస్ట్‌ అండ్‌ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

విశాఖ కేంద్రంగా స్టార్టప్స్ కోసం మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండాలన్నారు. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

మార్చి తొలి వారంలో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. అదే నెలలో జీ20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కానుంది. ఇక, విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలనే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రులు చెబుతున్నారు. ఇదే సమయంలో సుప్రీంలోనూ మూడు రాజధానుల అంశం విచారణ జరగనుంది. దీంతో..ఇప్పుడు విశాఖ చుట్టూ పాలనా పరమైన - రాజకీయ వ్యవహారాలు తిరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+