ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రసంగం-పేదలతోనే నడక-పెత్తందార్లతోనే యుద్ధమని ప్రకటన
ఏపీలో నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, పథకాల అమలుపై ఇవాళ మరోసారి అసెంబ్లీలో సీఎం జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న లబ్దిపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన జగన్.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఏకరువు పెట్టారు.

2020-21లో ఆర్ధిక వృద్ధిలో ఏపీ జాతీయ స్ధాయిలోనే నంబర్ వన్ గా ఉందని సీఎం జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా నంబర్ వన్ గా ఉన్నామన్నారు. గ్రామాల నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ 45 నెలల జగన్ మార్క్ కనిపిస్తోందని సీఎం వెల్లడించారు. ఏ గ్రామానికి వెళ్లినా మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని స్ధాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సీఎం తెలిపారు.వైసీపీ మ్యానిఫెస్టోలో 80 శాతం నెరవేర్చినట్లు సీఎం జగన్ తెలిపారు. మ్యానిఫెస్టో అంటే పవిత్ర గ్రంధం అని నిరూపించామన్నారు.
రాజకీయ వ్యవస్ధలో గొప్ప మార్పు తీసుకొచ్చామని, పాలనలో పారదర్శకత తెచ్చేలా నాలుగేళ్ల పాలన సాగిందన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా పథకాలు అమలు చేశామన్నారు. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ, నాడు-నేడు పథకాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. గతంలో 39 లక్షల మందికి 2 వేలు పెన్షన్ అందితే ఇప్పుడు 64 లక్షల మందికి 2750 పెన్షన్ ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. పెన్షన్ రూ.3 వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏపీ విధానాలను మిగతా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు.
రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న విధానం దేశంలో ఎక్కడా లేదని సీఎం జగన్ తెలిపారు. గతంలో ప్రభుత్వ బడులు శిధిలావస్ధలో ఉండేవని, రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటుతో పోటీ పడే రోజులు వస్తాయన్నారు. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ క్లాస్ రూమ్ లు అమలు చేస్తామన్నారు. 8వ తరగతి నుంచి విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్ లు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ట్యాబ్ లు ఇచ్చే విషయంలో ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడాల్సి రావచ్చన్నారు.
విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నామని, లంచాలకు తావులేకుండా నేరుగా లబ్దిదారులకు మేలు జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1.97 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లోకి పంపామన్నారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి అని, గడప గడపకూ వెళ్లి చేసిన మంచి చెప్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత మెరుగయ్యాయని, సచివాలయాల్లో 600 సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రతీ 50 ఇళ్లకో వాలంటీర్ సేవలు అందిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నా నడక నేల మీదే..నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే అని వెల్లడించారు. నా యుద్ధం.. పెత్తందార్లతోనే అన్నారు. నా లక్ష్యం.. పేదరికం నిర్మూలనే అని జగన్ తెలిపారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications