జగన్ కు మద్దతుగా 1.16 లక్షల కుటుంబాలు - సీఎం కీలక సందేశం..!!

తనకు మద్దతుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు చెప్పారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా సర్వే లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి 16 లక్షల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ పాలకు మద్దతు ప్రకటించారు. కోటి 45 లక్షల కుటుంబాల నుంచి ప్రభుత్వ పాలన పైన అభిప్రాయ సేకరణ చేసారు. అందులో వచ్చిన స్పందన పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. క్యాడర్ కు ధన్యవాదాలు చెప్పారు.

కోటి 16 లక్షల కుటుంబాల మద్దతు: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు వైఎస్సార్సీపీ భారీ కార్యక్రమం నిర్వహించింది. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో 29వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో మొత్తం 1.60 లక్షల కుటుంబాలను కలవాలని నిర్ణయించారు. పార్టీ నేతలతో పాటుగా వార్డు కో ఆర్డినేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలలు, మంచి గురించి వివరించారు. గత పాలన..ప్రస్తుత పాలన గురించి వివరిస్తూ కరపత్రాలు అందించారు. ఇదే సమయంలో పాలన పైన పబ్లిక్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అందులో భాగంగా కోటి 16 లక్షల కుటుంబాలు జగన్ కు మద్దతు ప్రకటించాయి. మెగా పల్స్ సర్వే ఫలితాలను వైసీపీ నేతలు వెల్లడించారు. వీరంతా జగన్ పాలనకు మద్దతు ప్రకటిస్తూ మిస్డ్ కాల్స్ ఇచ్చారు.

CM Jagan

ముఖ్యమంత్రి జగన్ స్పందన: ఈ స్పందన పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. పాలన పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్ చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన వైసీపీ పార్టీ క్యాడర్ కు ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు చెప్పారు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేసారు. మెగా సర్వే ఫలితాలతో వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. సర్వేలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా పాలనా పరంగా ఎన్నికల సమయంలోగా అవసరమైన నిర్ణయాల దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

జగనన్నకు చెబుదాం: ఈ రకమైన సర్వే ద్వారా గ్రామస్థాయిలో కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న వాస్తవాలు తెలుసుకున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మెగా సర్వే పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు చేయలేదని పార్టీ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన సమయంలో ఏడు లక్షల మంది గృహసారథులు, నాయకల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజల నుంచి స్వచ్చందంగా వచ్చిన సమాధానాల ఆధారంగా అవసరమైన నిర్ణయాలు ఉంటాయని నేతలు స్పష్టం చేసారు. దీంతో, ఇక ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా మే 9వ తేదీ నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+