సీఎం జగన్ విశాఖ పర్యటన: హర్యానా సీఎంతో భేటీ; ఆంతర్యం ఇదేనా?
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో ఆయన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటల పర్యటన కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి వెళుతున్న క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11 గంటల 5 నిమిషాలకు ఆయన విశాఖ చేరుకుంటారు. అక్కడి నుండి 11 గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్ నెస్ రిసార్ట్ కు వెళతారు. అక్కడ నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవనున్నారు. ఆయనతో భేటీ అయిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 1. 20 నిమిషాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి బయలుదేరి 2. 30 నిమిషాలకు తాడేపల్లి లోని నివాసానికి చేరుకుంటారు.

అయితే హర్యానా సీఎంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ కు వెళ్లి మరీ నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవడం వెనుక రాజకీయ కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ జరుగుతుంది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ సాధారణ భేటీ కాదని భావిస్తున్నారు.
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న వేళ మనోహర్ లాల్ కట్టర్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలబెడుతున్నారా? ఇక ఈ అంశం పైన జగన్ మనోహర్ లాల్ ఖట్టర్ తో మంతనాలు జరుపనున్నారా? లేదంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు గురించి చర్చించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. కాకుంటే మరేదైనా ఇరు రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఏదైనా చర్చ జరగబోతుందా అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications