సీఎం జగన్ వర్సెస్ జనసేనాని- మధ్యలో టాలీవుడ్ : నలిగిపోతున్న "ఆచార్య"- పవన్ వెనుక అఖండ..!!
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. వైసీసీ వర్సస్ జనసేన గా సాగుతున్న రాజకీయ పోరు..సినీ పరిశ్రమ పైనా ప్రభావం చూపుతోంది. కొద్ది నెలల క్రితం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన చేసిన విమర్శలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. తన మద కోపంతో సినీ పరిశ్రమను టార్గెట్ చేయవద్దని..సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే తాట తీస్తానంటూ పవన్ హెచ్చరించారు. ఆ తరువాత పవన్ వ్యాఖ్యలతో ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో సహా పలువురు సినీ ప్రముఖులు పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వంతో గ్యాప్ పెరుగుతోందా
ఆ తరువాత ఏపీ ప్రభుత్వంతో వరుసగా సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం నేరుగా ఏపీ మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి మాట్లాడారు. పవన్ పేరు ప్రస్తావించకపోయినా... సినీ పరిశ్రమ -ప్రభుత్వం మధ్య సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక, తాజాగా ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల విధానం తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో టిక్కెట్ల ధరలను ఖరారు చేసింది. తెలంగాణలో టిక్కెట్ల ధరలు బాగానే ఉన్నా.. ఏపీలో మాత్రం టిక్కెట్ ధరల పెంపుకు అవకాశం ఇవ్వకపోవటం..బెనిఫిట్ షో ల ప్రదర్శనకు అనుమతులు రద్దు చేయటంతో టాలీవుడ్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సినిమాలకు దగ్గర పడుతున్న ముహూరత్ం
సంక్రాతి సమయంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు ముహుర్తం ఖరారు చేసారు. ఆచార్య..ఆర్ఆర్ఆర్..భీమ్లా నాయక్..విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచకపోతే నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాత దానయ్య సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. దీని పైన ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు చేసారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చర్చ
అదే సమయంలో తన ఆర్దిక మూలాలు దెబ్బ తీసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల ధరలు పెట్టటం..టిక్కెట్ ధరల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను అవసరమైతే ఫ్రీ గా తన సినిమాలు వేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరల అంశం మొత్తం టాలీవుడ్ సమస్యగా సినీ ప్రముఖులు ప్రస్తావిస్తున్న సమయంలో..పవన్ కళ్యాణ్ ఇలా..తనను దెబ్బ తీసేందుకే అంటూ రాజకీయాలను తీసుకురావటం పైన ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి సైతం తన సినిమా ఆచార్య విడుదలకు అంతా సిద్దమైనా..విడుదల చేయాలంటే ఆలోచించాల్సి వస్తోందంటూ ప్రస్తుత సమస్యలను వివరించారు.

టిక్కెట్ల ధరల పైన ఆందోళన
రెండు తెలుగు ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు సహకరించాలని కోరారు. ఆ తరువాత నాగార్జున..అల్లు అరవింద్..సైతం ఇదే కోరారు. తాజాగా ముఖ్యమంత్రికి అప్పీల్ అంటూ ఇదే అంశం పైన ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ అధికార పార్టీ నేతలు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. అయితే, కొందరు సినీ ప్రముఖుల్లో మాత్రం బాలయ్య నటించిన అఖండ మూవీ ధైర్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
Recommended Video

అఖండ మూవీతో పరిశ్రమకు ఊరట
ఈ సినిమా హిట్ కావటం.. వసూళ్లు రికార్డు స్థాయిలో రావటం..ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తుండటంతో...కొత్త సినిమాల వసూళ్ల పైన ఆశలు పెరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వమే టిక్కెట్ల ధరల పైన నిర్ణయం తీసుకుంటే మరింత తోడ్పాటు దొరుకుతుందని టాలీవుడ్ ఆలోచిస్తోంది. అయితే, ప్రభుత్వం ను ఒప్పించే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారు.. ముఖ్యమంత్రితో అప్పాయింట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, సినిమా విడుదలకు ముందే టిక్కెట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనేలా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications