సీఎం జగన్ పనితీరుతో త్వరలోనే ప్రధమస్థానంలో నిలుస్తారు : వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు ఓ సర్వే కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం దక్కింది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలవగా, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో ఉన్నారు.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో ఉండటంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పనితీరుతో త్వరలోనే ప్రథమస్థానంలో నిలుస్తారని ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరం కాలంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో మూడవ స్థానంలో నిలవడం నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాలలో విస్తృతమైన కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో ఆయన ఫస్ట్ ర్యాంకు సాధిస్తారని తనకు తెలుసు అంటూ పరిమళ్ నత్వాని ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని.












Click it and Unblock the Notifications