ఢిల్లీలో జగన్ రాజకీయం, యాక్షన్ ప్లాన్ - ఆ ఇద్దరికీ సంకేతాలు క్లియర్..!!

ఒక్క పర్యటన మొత్తం లెక్కలనే మార్చేసింది. ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. పార్టీలు ముందస్తుగానే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాయి. సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. జగన్ సింగిల్ ఫైట్ కే సిద్దమయ్యారు. తిరిగి 2014 పొత్తులు ఖాయమని అందరూ భావించారు. ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన..ఒక్క భేటీ మొత్తం సీన్ మార్చేసింది. ఏపీ లో ఎన్నికల వేళ అసలు ఆట మొదలైంది.

మారుతున్న సమీకరణాలు : ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ను ఓడించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయని పవన్ గతంలోనే స్పష్టం చేసారు. బీజేపీకి ప్రతిపాదనలు అందించారు. ఢిల్లీలో చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. దీంతో ఇక మూడు పార్టీలు కలిసినట్టేనని అందరూ భావించారు. ఏపీకి వచ్చిన నడ్డా, అమిత్ షా వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు.

cmjaganmeetmodi

ముఖ్యమంత్రి జగన్ సైతం ఒక సభలో తనకు బీజేపీ లాంటి పార్టీల మద్దతు ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో..ఈ వాదన మరింత బల పడింది. కేంద్రంలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసే యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీ యాత్రకు వెళ్లారు.

ప్రధానితో సీఎం సుదీర్ఘ చర్చలు : ఢిల్లీలో సీఎం జగన్ హోం మంత్రి అమిత్ షాతో సుదీర్ఘ చర్చలు చేసారు. ప్రధాని మోదీతో దాదాపు గంటా 20 నిమిషాల సమావేశం జరిగింది. వైసీపీకి దూరంగా టీడీపీకి మద్దతుగా బీజేపీ అడుగులు వేస్తుందనే ప్రచారం వేళ ఈ సుదీర్ఘ సమావేశం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. బీజేపీ ముఖ్య నేతలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నారనేది స్పష్టం అవుతోంది.

భవిష్యత్ కార్యాచరణ..ముందస్తు ఎన్నికల గురించి ప్రధాని - ముఖ్యమంత్రి మధ్య చర్చ జరిగిందని జాతీయ మీడియా రిపోర్టు చేసింది. సీఎం జగన్ తో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతు నుంచి ఎన్నికల ఆలోచనల వరకు కేంద్రంలోని ముఖ్యులు చర్చించటం ద్వారా జగన్ ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టం అవుతోంది. ఇదంతా గమనిస్తున్న టీడీపీ..జనసేన నేతలకు అసలు విషయం అర్దమైంది.

cmjaganmeetmodi

సంకేతాలు స్పష్టంగా : కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించటం కేంద్రంలోని ముఖ్యుల లక్ష్యం. ఏపీలో అధికారంలోకి రావటం జగన్ టార్గెట్. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపాదించే బిల్లులను ఆమోదించుకోవటం బీజేపీ ముందున్న అసలు పరీక్ష. ఇందులో వారికి సీఎం జగన్ సహకారం కావాలి. జగన్ కు ఏపీలో తన సంక్షేమ పథకాలు...ఎన్నికల వేళ కీలక నిర్ణయాల అమలు కోసం కేంద్రం నుంచి పెండింగ్ నిధులు విడుదల చేయించుకోవాలి.

దీంతో..తాజా పరిస్థితులను సీఎం జగన్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అదే సమయంలో తనను ఓడిస్తానని శపథాలు చేస్తున్న టీడీపీ, జనసేన అధినేతలకు ఢిల్లీ సమావేశాలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీని ద్వారా ఏపీ రాజకీయ పిక్చర్ క్లియర్. బీజేపీ పాత్ర ఏంటనేది స్పష్టం అవుతోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+