విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీలో జగన్ పట్టు నిరూపించేలా : వ్యతిరేక నేతల సెల్ఫ్ గోల్ - షాక్ : బీజేపి హైకమాండ్ ఫుల్ సపోర్ట్..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ కేంద్రంగా పట్టు బిగిస్తున్నారు. గతం కంటే భిన్నంగా మద్దతు లభిస్తోంది. కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు నుంచి వ్యూహాత్మకంగా ఎన్డీఏ నుంచి టీడీపీని దూరం చేసిన జగన్. .క్రమేణా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా క్లోజ్ రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా.. అవసర మైన అన్ని సందర్భాల్లోనూ కేంద్ర నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ.. ప్రధాని - షా ఏపీకి వచ్చిన సమయంలోనూ సీఎం వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు. వారు సైతం జగన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఢిల్లీలో జగన్ బలం పెరుగుతోందా

ఢిల్లీలో జగన్ బలం పెరుగుతోందా


ఇక, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల వద్ద సీఎం జగన్ ఏ స్థాయిలో పట్టు సాధించారో నిరూపిస్తున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తనకు బీజేపీ ప్రముఖులు..ప్రధానితో ఉన్న సత్సంబంధాలతో సీఎం జగన్ తో సహా.. ఆ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తూ వచ్చారు. కానీ, సందర్బం చూసి రఘురామ సొంత నియోజకవర్గంలోనే... ప్రధాని పర్యటనలోనే ఢిల్లీలో తన పట్టు ఏంటో సీఎం నిరూపించారు. స్వయంగా ప్రధాని పాల్గొనే సభలో..స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం రఘురామ పాల్గొనాల్సి ఉంది. కానీ, ప్రధాని కార్యాయలయం నుంచి వచ్చిన అతిధుల జాబితాలో ఎంపీ పేరు లేదు. దీని వెనుక ఏం జరిగిందనేది అందరికీ అర్దమయ్యే విషయమే.

 వరుస పరిణామాల్లో సీఎందే పై చేయి

వరుస పరిణామాల్లో సీఎందే పై చేయి


దీంతో..భీమవరం బయల్దేరినా.. మధ్యలోనే ఆయన డ్రాప్ అయ్యారు. ప్రధాని కార్యాలయం జాబితాలో ఎంపీగా తన పేరు లేకపోవటంతో రఘురామ షాక్ అయ్యారు. ఇక, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అసలు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ మద్దతు కోరలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలే మంత్రుల వెనుక నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీనిని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. పత్రికల్లో వచ్చిన వార్తలను బీజేపీ ముఖ్యులకు షేర్ చేసింది. దీంతో.. రాష్ట్రపతి అభ్యర్ధి ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీ.. అమిత్ షా.. రాజ్ నాధ్ సింగ్ సీఎం జగన్ ను కోరారని తేల్చి చెప్పారు.

బీజేపీ ముఖ్య నేతల మద్దతు

బీజేపీ ముఖ్య నేతల మద్దతు


ఆ రకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతవి వ్యక్తిగత వ్యాఖ్యలుగా తేల్చేసారు. ఆ వ్యాఖ్యలు చేయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ బీజేపీలో రెండు రకాల వాదనలు ఉన్నాయి. బీజేపీ అధినాయకత్వం - కేంద్ర పెద్దలతో సీఎం జగన్ సంబంధాల కారణంగా ఆచి తూచి స్పందించే నేతలు కొందరైతే... జగన్ పైన వ్యతిరేకతను సందర్భం వచ్చిన ప్రతీ సారి బయట పెట్టుకొనే నేతలు మరి కొందరు. ఇక, సత్యకుమార్ పైనే షెకావత్ లాంటి సీనియర్ మంత్రి..నేత ఆగ్రహం వ్యక్తం చేయటంతో..ఇది పూర్తిగా సత్యకుమార్ సెల్ఫ్ గోల్ గా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో..గతం కంటే భిన్నంగా జగన్ ఢిల్లీలో తన పట్టు ఏంటనేది సందర్భం వచ్చిన ప్రతీ సారి నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.

English summary
CM JAgan showing his grip in relations with Central govt key leaders,seem to be BJP taking care of AP CM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X