సిగ్గు శరం ఉందా.. చేతకాని దద్దమ్మ: సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా బీఆర్ఎస్

ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీరు, విద్యుత్ కొరత ఉందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోత ఉందని చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులే కారణమని కెసిఆర్ వెల్లడించారు.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ ట్వీట్
ఇక ఈ విషయంపై ప్రశ్నించిన కెసిఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది అంటూ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

CM Revanth Reddy vs kcr social media war over osmania university water and electricity problem

అప్పట్లో కూడా విద్యుత్, నీటి కొరత.. ఉందన్న రేవంత్ రెడ్డి
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్ లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారని ఒక నోటీసును ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు.

మాటకు మాట... ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్
కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇక దీనికి సమాధానంగా బి ఆర్ ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే! రేవంత్ రెడ్డి అంటూ పేర్కొంది.

సిగ్గు, శరం, మానం, అభిమానం ఉందా
గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలని బీఆర్ఎస్ ఘాటుగా విమర్శించింది.

నీ ఫేక్ ముచ్చట్లు అక్కడకు వెళ్లి చెప్పు.. ఉరికిస్తారన్న బీఆర్ఎస్
విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మవి నువ్వు.. వెళ్ళి, నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంట్ కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు.. నిన్ను ఉరికిస్తారు అంటూ పేర్కొంది. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్.. చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్ అంటూ ఎదురు దాడి చేసింది.

ఫేక్ సర్క్యూలర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావు
ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే... అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యూలర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే.. ఎంత అభత్రభావంతో బ్రతుకుతున్నావో అర్థమవుతుందని మండి పడింది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దాం అనుకుంటే ప్రజలు నీ లాగుల తొండలు ఇడుస్తరు.. ఖబడ్దార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+