వైఎస్ జగన్ సర్‌ప్రైజ్ విజిట్..!!

YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో నిర్మించిన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన కిడ్నీ, డయాలసిస్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకోసం నిర్మించిన ఆసుపత్రి, అక్కడి నీటి ప్రభావం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు అవి. సుదీర్ఘకాలంగా వెంటాడుతోన్న ఉద్దానం కిడ్నీ సమస్యకు వైఎస్ జగన్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపించింది.

CM YS Jagan has hold aerial survey on the works for the Mulapeta Port in Srikakulam

ఉద్దానం ప్రాంతానికి మంచినీటిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా 700 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హిరమండలంలో గల రిజర్వాయర్ నుంచి వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని తరలించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. 32 కిలోమీటర్ల పొడవునా భూగర్భ పైప్‌లైన్ ద్వారా నీటిని ఈ నీటి శుద్ధి కేంద్రానికి చేర్చుతారు.

అక్కడి నుంచి 132 కిలోమీటర్ల మేర భూగర్భ పై‌ప్‌లైన్‌ ద్వారా ఉద్దానం చివరి ప్రాంతమైన ఇచ్చాపురం వరకు రక్షిత మంచినీటిని ప్రభుత్వం అందిస్తోంది. ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ఈ శుద్ది కేంద్రం నుంచి మంచినీరు సరఫరా అవుతోంది.

దీన్ని ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్.. మూలాపేట పోర్ట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియల్ సర్వే ద్వారా పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాలోని సంత బొమ్మాళి మండలంలో ఈ పోర్ట్ నిర్మితమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జగన్ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

తొలిదశలో 3,600 కోట్ల రూపాయలను ఈ ఓడరేవు నిర్మాణానికి కేటాయించింది ప్రభుత్వం. ఫేస్-1 నిర్మాణ పనులను విశ్వ సముద్ర గ్రూప్‌ చేపట్టింది. సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల కార్గో లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యంతో ఈ పోర్ట్ రూపుదిద్దుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+