రాయలసీమకు అది వరప్రదాయిని..!!
YS Jagan: అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి వద్ద నిర్మించిన టన్నెల్ ఇది. గాలేరు- నగరిలో అంతర్భాగంగా దీన్ని ప్రభుత్వం నిర్మించింది.
మెట్టుపల్లికి చేరుకున్న తరువాత ముందుగా ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన టన్నెల నిర్మాణ స్థితిగతుల గురించి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ టన్నెల్ 2 గుండా నీటిని విడుదల చేశారు. దీన్ని జాతికి అంకితం చేశారు. గాలేరు- నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని దీని గుండా తరలించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

అవుకు తొలి టన్నెల్, రెండో టన్నెల్ పనులకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 340.53 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2014- 19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ టన్నెల్ నిర్మాణానికి చేసిన వ్యయం దాదాపుగా నామమాత్రమే. 81.55 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది. కీలకమైన ఫాల్ట్ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది.
ప్రభుత్వం మారి.. అధికారం వైఎస్ జగన్ చేతికి వచ్చిన తరువాత మళ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 145.86 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వం. టన్నెల్ 2 నిర్మాణ పనులను దిగ్విజయంగా పూర్తి చేసింది. టన్నెల్ 3 నిర్మాణ పనుల కోసం ఇప్పటివరకు మరో 934 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. దీని నిర్మాణ కూడా తుదిదశకు వచ్చింది.
రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ, ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ‘అవుకు రెండో టన్నెల్’ను నేడు ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. #GNSS #OWKTunnel pic.twitter.com/30sH8MZrxP
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 30, 2023
మూడో టన్నెల్ పొడవు 5.801 కిలో మీటర్లు. ఇందులో ఇప్పటికే 4.526 కిలో మీటర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా 1,501.94 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది జగన్ సర్కార్. వీటి ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగుతుంది.












Click it and Unblock the Notifications