విజయవాడవాసులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన జగన్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వాటి విలువ సుమారు సుమారు 700 కోట్ల రూపాయల పైమాటే. అలాగే- విజయవాడలో వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉంటూ వచ్చిన 31,866 ఇళ్ల పట్టాలను రెగ్యులరైజ్ చేసే కార్యక్రమానికీ శ్రీకారం చుట్టారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. వాటి విలువ 239 కోట్ల రూపాయలు. కృష్ణానదికి రెండు వైపులా నిర్మించిన రిటైనింగ్ వాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు.

రెగ్యులరైజ్ చేయడం ద్వారా- 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న సుమారు 21,000 మందికి లబ్ది కలుగుతుందని అన్నారు. మరో 9,125 పట్టాలు అన్-అబ్జెక్షనబుల్ ల్యాండ్స్‌లో ఉన్న పట్టాలనూ క్రమబద్దీకరించనున్నట్లు చెప్పారు.
కృష్ణానదికి రెండు వైపులా కరకట్ట గోడలు 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని, దీనివల్ల వరదలు సంభవించినప్పుడు కృష్ణలంక ప్రాంతానికి ముంపు బెడద తప్పుతుందని జగన్ అన్నారు. కృష్ణలంకలో పార్కు సుందరీకరణ పనులను చేపట్టామని, దీనికి కృష్ణమ్మ జల విహార్ అని పేరు పెడతామని అన్నారు.
విజయవాడ నగరం పరిధిలో ఎప్పుడూ లేని విధంగా 400 కోట్ల రూపాయల వ్యయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్కును నిర్మించామని జగన్ చెప్పారు. గతంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా అందుబాటులో ఉండేది కాదని, ఇప్పుడు వాటిని తామే నిర్మించామని గుర్తు చేశారు.
తన అయిదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దామని, ప్రతి పేదవాడు కోరుకునేలా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించగలిగామని జగన్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కేంద్రాలను వారి గ్రామాల్లోనే నిర్మించామని చెప్పారు.
వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రతి ఇంటికీ చేరువ చేశామని జగన్ పేర్కొన్నారు. ఒక్క రూపాయీ కూడా లంచం లేకుండా అవినీతి రహిత పాలనను ఈ 58 నెలలలో అందించామని చెప్పారు. ఈ పర్యటనలో జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, విజయవాడ వెస్ట్ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ ఉన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications