పవన్ పై జగన్ భారీ పంచులు, అదే ఏడుపు - తెర మీదకు కొత్త నినాదం..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు - పవన్ లక్ష్యంగా మాస్ పంచులు వేసారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ - మ్యారేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణలో తాను పుట్టనందుకు బాధ పడుతున్నానని చెప్పిన వ్యక్తం ఏపీకి నాన్ లోకల్ అని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో పొత్తులు..ఎత్తులు..జిత్తులు..కుయుక్తుల మీద ఆధారడతాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రయోజనం మినహా ఏపీపై పవన్ కు ప్రేమ లేదని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై వ్యాఖ్యలు: ముఖ్యమంత్రి జగన్ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు సీఎం వైయస్ జగన్ జాతికి అంకితం చేశారు. తన పాదయాత్ర సమయంలో ఉద్దానం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చానని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో ఉద్దానం సమస్య ఉన్నా పరిష్కారం చేయాలనే మనసు రాలేదని విమర్శించారు. నాడు రాని పరిష్కారం నేడు ఈ ప్రభుత్వం చూపించిందన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో తాగు నీరు ఇవ్వలేని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. మూడు సార్లు సీఎంగా ..45 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పుకోవటానికి ఒక్క మంచి పని చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేసారు.
బర్రెలక్కకు వచ్చిన ఓట్లు రాలేదు: తెలంగాణలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ అక్కడ చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు. తెలంగాణలో తాను పుట్టనందుకు బాధపడుతున్నానని చెప్పారని..ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ డైలాగ్స్ కొట్టారని వివరించారు. ఏపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కు రాలేదని సీఎం జగన్ ఎద్దేవా చేసారు. డిపాజిట్లు దక్కలేదన్నారు.

చంద్రబాబు ప్రయోజనం మినహా ఏపీ పైన పవన్ కు ప్రేమ లేదన్నారు. పవన్ కు సొంత నియోజకవర్గం కూడా లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టనర్ నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అంటూ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి దత్తపుత్రుడుని పెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో రాజధాని మొదలు ఏం చేసినా ఈ ఇద్దరికీ ఏడుపే ఏడుపు అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురంలో రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైయస్ఆర్ సుజలధార తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం వైయస్ జగన్#YSJaganCares#YSJaganForUddhanam#CMYSJagan#AndhraPradesh pic.twitter.com/TCDrCPjqFz
— YSR Congress Party (@YSRCParty) December 14, 2023
నాన్ లోకల్ స్టార్స్: ఈ ఇద్దరికీ ఏనాడు ఇచ్చిన మాట పైన నిలబడిన చరిత్ర లేదన్నారు. సమాజం గురించి పట్టని ఇలాంటి క్యాన్సర్ గడ్డను ఎన్నికల్లో తొలిగించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో నాలుగు ఆఫీసులో పెట్టినా ఏడుస్తారని..సీఎంగా ఇక్కడ ఉంటానంటే ఏడుస్తారని జగన్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం- పోర్టు వస్తుందన్నా ఏడుస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
నాలుగున్నారేళ్ల కాలంలో పేదల కోసం చేసిన నిర్ణయాలను వివరించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉద్దానం నీటి ప్రాజెక్టు ద్వారా 6.70 లక్షల మందికి సురక్షిత నీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ను మరో రూ 265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గ పరిధిలోనూ విస్తరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications