ఆరోగ్యశ్రీపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం... ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు...

రాష్ట్రంలో ఆరోగ్య ఆసరా పథకం కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకూ సాధారణ ప్రసవానికి రూ.3వేలు, సిజేరియన్‌కు రూ.1వెయ్యి అందిస్తుండగా... ఇప్పటినుంచి సాధారణ ప్రసవానికి రూ.5వేలు,సిజేరియన్‌కు రూ.3వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం,కోవిడ్ 19పై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ప్లాస్మా దాతలకు నగదు సాయం...

ప్లాస్మా దాతలకు నగదు సాయం...

జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు. క్యూఆర్ కోడ్ కార్డులను మరింత సమగ్ర సమాచారంతో రూపొందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు ప్రమాణాల పరంగా మెరుగవ్వాలని... మంచి గ్రేడింగ్ రావాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ కరోనా కిట్ అందించాలని... కోవిడ్ 19 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ నిర్వహించాలని చెప్పారు. ప్లాస్మా దాతలను ప్రోత్సహించేందుకు రూ.5వేలు నగదు సాయం అందించాలన్నారు.

ఆరోగ్యమంత్రిపై కీలక ఆదేశాలు...

ఆరోగ్యమంత్రిపై కీలక ఆదేశాలు...

రాష్ట్రంలో ఇప్పటివరకూ 540 ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్కులు ఏర్పాటవగా... మిగతా 27 ఆస్పత్రుల్లోనే త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను ఏర్పాటు చేయాలని... వారికి ప్రధానంగా 6 బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అందించే ఆహార నాణ్యత, వైద్యుల అందుబాటు,మౌలిక సదుపాయాల కల్పన,శానిటేషన్,ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం,పేషెంట్‌ కేరింగ్ బాధ్యతలను వారికి అప్పగించాలన్నారు. 2 వారాల్లోగా అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్రల నియామకాలు పూర్తి చేయాలన్నారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు గ్రేడింగ్ తప్పనిసరి..

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు గ్రేడింగ్ తప్పనిసరి..

ప్రతీ ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి గ్రేడింగ్‌ తప్పనిసరి అని సీఎం జగన్ అన్నారు. అక్కడి ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని... అన్ని ఆస్పత్రులు ఏ గ్రేడింగ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు 6 నెలల గడువు ఇచ్చి... ఆలోగా ప్రమాణాలు మెరుగుపడకపోతే జాబితా నుంచి తొలగించాలని చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు కొత్తగా ఏర్పాటు కాబోయే 16 ఆస్పత్రులు,ఐటీడీఏల పరిధిలో ఏర్పాటవుతున్న ఆస్పత్రుల్లోనూ మెరుగైన ప్రమాణాలు ఉండాలన్నారు.

Recommended Video

    Rice Cards To Transgenders & Orphans : AP Govt ట్రాన్స్ జెండర్ లకు అండగా ఏపీ సర్కార్ || Oneindia
    క్యూఆర్ కార్డులపై...

    క్యూఆర్ కార్డులపై...


    ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌లో రోగి బ్లడ్‌ గ్రూప్‌ సమాచారం కూడా ఉండాలని సీఎం అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల సాయంతో ఆ కార్డులను పంపిణీ చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికారులు... నర్సింగ్‌, శానిటేషన్‌ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ట్రైనింగ్ నర్సులకు సంబంధించి అని జిల్లాల్లో 20,415 పోస్టులకు అనుమతిచ్చినట్లు చెప్పారు. ఇందులో ఇప్పటివరకూ 12,014 మంది నియామకం జరిగినట్లు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+