సీఎం రాక, జగన్ మాటల తూటాలు, టార్గెట్, కుప్పం పక్కలో ఏం జరుగుతోంది ?, హైవే హంగామాతో !
ఓకే ఒక్క చాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజల్లోకి దూసుకుపోయి అధికారం దక్కించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం అయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ చాలా మారిపోయారని ఆయనకు చాలా సన్నిహితంగా ఉంటున్న వాళ్లు, వైసీపీ నాయకులు చెప్పకపోయినా జగన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు.
ఇప్పుడు వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెలుతున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి అధికారం దక్కించుకోవాలనే లక్షంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో వీలైనన్ని లోక్ సభ సీట్లు కూడా గెలుచుకోవాలని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే లక్షంగా వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లాపై వైఎస్ జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే ఉమ్మడిచి చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావడం, ఇప్పుడు ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులు కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆ ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతిలో పెట్టిన వైఎస్ జగన్ అన్నా ఏం చేస్తావో తెలీదు కుప్పంలో కూడా మనమే గెలవాలి అని చెప్పారని తెలిసింది. ఇదే సందర్బంలో చిత్తూరు జిల్లాలోని పలమనేరులో మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి ఎన్, అమరనాథ్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి సీఎం జగన్ ప్లాన్ చేశారు. పలమనేరులో సీఎం జగన్ పర్యాటన ఖరారు అయ్యింది.

శనివారం (మే 4వ తేదీ)న సీఎం వైఎస్ జగన్ పలమనేరులో పర్యటించడానికి డేట్ ఫిక్స్ చేశారు. శనివారం సీఎం జగన్ పర్యటన సందర్బంగా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడ సభా స్తలాన్ని పరిశీలించారు. సీఎం జగన్ పాల్గొనే బహిరంగ సభ సమావేశం ప్రాంగణాన్ని ఎమ్మెల్యే వెంకటే గౌడతో పాటు చిత్తురు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు పరిశీలించారు.
గంగవరంలోని సాయిబాబా ఆలయం సమీపంలోని ఖాళీ స్థలంలో వైఎస్ జగన్ కోసం హెలిపాడ్ ఏర్పాటు చెయ్యడానికి పరిశీలించారు. గంగవరంలోని సాయిబాబా ఆలయం సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసే హెలిపాడ్ కు చేరుకుంటున్న సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి ఎంటీబీ రోడ్డులో జరిగే రోడ్ షోలో పాల్గొంటారని వైసీపీ నాయకులు తెలిపారు. సీఎం జగన్ రోడ్ షో, బహిరంగ సభ విజయవంతం కావడానికి వైసీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

శనివారం పలమనేరులో జరిగే సీఎం వైఎస్ జగన్ రోడ్ షో, బహిరంగ సభ విజయవంతం చెయ్యడానికి వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పలమనేరుతో పాటు పుంగనూరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తంబాళపల్లె, పీలేరు అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పలమనేరు పక్కనే పుంగనూరు ఉండటంతో బహిరంగ సభ విజయవంతం చేసే బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చూసుకుంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications