రెండు, మూడు రోజుల్లో ఆ పని పూర్తి చెయ్యండి .. ఇళ్ళ పట్టాల పంపిణీపై సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు' పై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అర్హులని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు.

రెండు మూడు రోజుల్లో మిగతా ఇళ్ళ పట్టాల పంపిణీ పూర్తి చెయ్యాలన్న జగన్
రాష్ట్ర వ్యాప్తంగా 30,06,673 ఇళ్ల పట్టాలకు గాను 26 ,21,049 ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఇప్పటివరకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 87.17 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని, కాలనీలలో 90 శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మిగతా పట్టాల పంపిణీ కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

సోషల్ ఆడిట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్న సీఎం
ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న తొలి పన్నెండు రోజుల్లో వాలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలని ఆదేశించారు. సోషల్ ఆడిట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు జగన్. వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను జగన్ కు అధికారులు వివరించారు. వైయస్సార్ జగనన్న కాలనీలలో అంగన్వాడీ కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, స్కూళ్లను, బస్ స్టాప్ లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.

వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇంటర్నెట్ సదుపాయం
అయితే వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని మౌలిక వసతులు కల్పించడం తో పాటుగా, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సూచించారు జగన్. డంపింగ్ యార్డులలో బయో మైనింగ్ చేయాలని వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఒక పక్క పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నా సీఎం జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో సమీక్షలు కొనసాగిస్తూ ప్రజల వద్దకే పాలన చేరేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications