వీడియో: సడన్‌గా దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్- అన్ ప్లాన్డ్
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడలో పర్యటించారు. గుణదలలో నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటల్ ఇది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్ కే రోజా, హయత్ ప్లేస్ హోటల్ ఛైర్మన్ వీరాస్వామి, హయత్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఏరియా అధ్యక్షుడు శ్రీకాంత్, వీరస్వామి తనయుడు కార్తీక్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడలో వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ నివాసంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ pic.twitter.com/5oU6857G1w
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 18, 2023
రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటకరంగంలో అగ్రగామిగా నిలపడానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హోటల్స్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని, పెట్టుబడి పెట్టేవారికి అవసరమైన రాయితీలను కల్పిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, వారందరూ ముందుకు రావాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. టూరిజం, హాస్పిటాలిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, పోర్ట్స్, ఐటీ, ఆటోమొబైల్.. వంటి రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి పలు రాయితీలను ప్రకటించామని ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం వైఎస్ జగన్.. నేరుగా దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు. ఇది అన్ ప్లాన్డ్ ప్రోగ్రామ్. అవినాష్ చేసిన విజ్ఞప్తి మేరకు అప్పటికప్పుడు వైఎస్ జగన్ గుణదలోనే ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అవినాష్ కుటుంబ సభ్యులు జగన్‌ను ఆత్మీయంగా స్వాగతం పలికారు. జగన్ వారితో గ్రూప్ ఫొటో దిగారు. చిన్నపిల్లలతో ఆప్యాయంగా మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో అవినాష్.. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. 2019 నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరారు.

ఈ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమౌతోన్నారు. ప్రస్తుతం ఈ స్థానం టీడీపీ ఆధీనంలో ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు. కమ్మ సామాజిక ఓటుబ్యాంకు బలంగా ఉన్న స్థానం కావడం వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్‌ను రంగంలోకి దించనుంది వైఎస్ఆర్సీపీ.












Click it and Unblock the Notifications