వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌స్కాం కేసు: దాసరి, జిందాల్ ప్రమేయంపై తుది నివేదికకు మరింత గడువు

కోల్ స్కాం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్‌ మాజీ సీఎం మధు కోడా, పారిశ్రామికవేత్త-కాంగ్రెస్‌ నాయకుడు నవీన్‌ జిందాల్‌ తదితరుల ప్రమేయానికి సంబంధించిన కేసు దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్‌ మాజీ సీఎం మధు కోడా, పారిశ్రామికవేత్త-కాంగ్రెస్‌ నాయకుడు నవీన్‌ జిందాల్‌ తదితరుల ప్రమేయానికి సంబంధించిన కేసు దర్యాప్తు తుది నివేదికను నిర్దుష్ట నమూనాలో సమర్పించేందుకు ప్రత్యేక కోర్టు సీబీఐకి మరికొంత గడువు మంజూరుచేసింది.

నివేదిక తయారీ పూర్తయిందని, దానిని సీనియర్‌ అధికారులకు పంపించానని, అందుచేత సమయమివ్వాలని ప్రత్యేక కోర్టు జడ్జి భరత పరాశర్‌ను సీబీఐ దర్యాప్తు అధికారి సోమవారం అభ్యర్థించారు. ఈ మేరకు తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 6న తేదీన తుది నివేదికను సమర్పించాలని జడ్జి ఆదేశించారు.

Coal Scam: Court Grants Time To CBI To File Final Report

కాగా, దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ.. సీబీఐ గతంలోనే నివేదిక ఇచ్చింది. అందులో ఫోరెన్సిక్‌ లేబొరేటరీ నివేదిక, డాక్యుమెంట్లు, సాక్షుల జాబితాలు కూడా అందులో ఉన్నాయి. అయితే అది నిర్దుష్ట రూపంలో లేదు. తుది నివేదిక సమర్పించకపోవడం వల్ల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు గతంలోనే ఆక్షేపించింది. ఈ క్రమంలోనే సీబీఐకి కోర్టు గడువును మంజూరు చేసింది.

English summary
A special court today granted time to CBI for filing the final report in a coal block allocation scam case against Congress leader and industrialist Naveen Jindal, ex-Minister of State for Coal Dasari Narayan Rao and others, in a proper format.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X