Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొన్న కప్ప... ఇప్పుడు భోజనంలో బొద్దింక.. ఆదికవి యూనివర్సిటీ హాస్టల్‌లో వరుస ఘటనలు

ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలోనూ, యూనివర్సిటీ హాస్టల్ లలోనూ పెడుతున్న భోజనం విద్యార్థుల ఆగ్రహానికి కారణంగా మారింది. బల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కప్పలు .. ఇలా రకరకాల జీవులు భోజనంలో వస్తుండటం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆందోళనకు కారణంగా మారింది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చాలా మంది ఆసుపత్రుల పాలు అవుతున్న పరిస్థితులు విద్యార్థుల, తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.

 హాస్టల్‌లోని ఓ విద్యార్థిని భోజనం చేసే ప్లేట్‌లో బొద్దింక

హాస్టల్‌లోని ఓ విద్యార్థిని భోజనం చేసే ప్లేట్‌లో బొద్దింక

ఇక తాజాగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలోని హాస్టల్ మెస్ పదేపదే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. సోమవారం హాస్టల్‌లోని ఓ విద్యార్థిని భోజనం చేసే ప్లేట్‌లో బొద్దింక కనిపించింది. దీంతో విద్యార్థులు అందరూ తాము తీసుకుంటున్న ఆహారం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆదికవి యూనివర్సిటీ హాస్టల్ మెస్ లో ఆహారం తీసుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని హాస్టల్ విద్యార్థులు చెబుతున్నారు.

అంతకు ముందు నన్నయ్య యూనివర్సిటీలో అల్పాహారంలో ఉడకబెట్టిన కప్ప

అంతకు ముందు నన్నయ్య యూనివర్సిటీలో అల్పాహారంలో ఉడకబెట్టిన కప్ప

ఇక అంతకుముందు కూడా అలాంటి ఘటనే హాస్టల్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులకు పెట్టిన అల్పాహారంలో ఉడకబెట్టిన కప్ప కనిపించింది. విద్యార్థులకు పెట్టిన అల్పాహారం ఉప్మాలో కప్ప కనిపించిందని విద్యార్థులు ఫిర్యాదు చేశారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి. అశోక్ తెలిపారు. ఘటనపై యూనివర్సిటీ అధికారుల బృందం ఆరా తీసి మెస్‌ను పరిశీలించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ టేకి ఘటనపై విచారణకు ఆదేశించింది. హాస్టల్ మెస్‌కు చెడ్డ పేరు తెచ్చేందుకు ఎవరో కుట్ర పన్నినట్లు యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.

భోజనంలో కప్పలు, బొద్దింకలు .. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు

భోజనంలో కప్పలు, బొద్దింకలు .. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు

అయితే విద్యార్థులు మాత్రం యూనివర్సిటీ హాస్టల్ మెస్ లో తమకు మంచి ఆహారం అందించడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల, విద్యార్థులు తాము మెస్ కు చెల్లించిన డబ్బులు, కార్పస్ ఫండ్‌లను తిరిగి చెల్లించాలని కోరుతూ ఆందోళనలు సైతం చేశారు నిర్వహించారు. యూనివర్సిటీ అధికారులు హాస్టల్ కి అయ్యే ఖర్చు, మెసేజ్ ల గురించి వివరించి ఒక్కో విద్యార్థికి రెండు వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించిన తర్వాత రోజు, విద్యార్థులు ప్రధాన గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుండా, డబ్బులు చెల్లించమని విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. కనీసం మంచి భోజనం కూడా పెట్టడం లేదంటూ విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీలోనూ భోజనంలో కాకి ఈక.. మెస్ కు తాళం వేసి విద్యార్థుల ఆందోళన

ఆంధ్రా యూనివర్సిటీలోనూ భోజనంలో కాకి ఈక.. మెస్ కు తాళం వేసి విద్యార్థుల ఆందోళన

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నాగార్జున వసతిగృహంలో కూడా మొన్నటికి మొన్న విద్యార్థులకు పెట్టిన భోజనంలో కాకి ఈక కనిపించడం కలకలం రేపింది. శనివారం రాత్రి భోజనంలో ఈ ఘటన చోటు చేసుకోగా,ఆదివారం ఉదయం 5 గంటలకు విద్యార్థుల మెస్ లోకి సిబ్బంది వెళ్ళకుండా తాళం వేసి నిరసన తెలియజేశారు. ఇంత దారుణంగా భోజనం ఎక్కడ పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తమకు తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించటంలేదు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన విద్యార్థులు, యూనివర్సిటీలోని పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+