Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ కేంద్రంగా TCS, కాగ్నిజెంట్ - ఉద్యోగులు ..ఆపరేషన్స్ పై కీలక నిర్ణయం..!!

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కీలక ప్రకటన చేసింది. విశాఖ కేంద్రంగా కార్యకలాపాల పైన స్పష్టత ఇచ్చింది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కోసం శంకుస్థాపన జరిగింది. హిల్‌-2లోని మహతి బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇక.. విశాఖ కేంద్రంగా కాగ్నిజెంట్ ఉద్యోగుల కేటాయింపు.. ఆపరేషన్స్ పైన సంస్థ సీఈవో కీలక ప్రకటన చేసారు. అదే విధంగా టీసీఎస్ కార్యకలాపాలపైన స్పష్టత వచ్చింది.

విశాఖ కేంద్రంగా కాగ్నిజెంట్ కార్యకలాపాల నిర్వహణకు సిద్దం అయింది. కాపులుప్పాడలోని 22.19 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు స్థలం కేటాయించారు. అక్కడ నిర్మాణం పూర్తయ్యే వరకూ హిల్‌-2లోని మహతి బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయ భవనంలో 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులు 500 మందిని బేస్‌ లొకేషన్‌ ప్రాతిపదికన విశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Cognizant announces operations launch form Visakha on 26th of this month

మరో 300 మంది సీనియర్‌ ఉద్యోగులను విశాఖకు బదిలీ చేశారు. లాజిస్టిక్, ఆపరేషనల్‌ సమస్యలను పరిష్కరించి ఈనెల 26వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. మరో 4,500 మంది ఉద్యోగులు విశాఖ వచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ వెల్లడించారు. వాస్తవానికి కాపులుప్పాడ శాశ్వత క్యాంపస్‌లో విడతలవారీగా 8 వేల మందికి ఉపాధి కల్పించాలని తొలుత నిర్ణయించారు.

అదే విధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) కూడా కాగ్నిజెంట్‌ తరహాలో ఒకేసారి శాశ్వత క్యాంపస్‌కు భూమిపూజ, తాత్కాలిక కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైనట్లు సమాచారం. ఫిబ్రవరిలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మిలీనియం టవర్స్‌-2లో రెండు బ్లాకులను సిద్ధం చేస్తోంది. 2వేల మందితో తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అదేవిధంగా హిల్‌-3లో ప్రభుత్వం కేటాయించిన 21.76 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేస్తారు.

డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సంస్థ క్యాప్‌జెమినీ, ఆర్‌ఎంజెడ్‌ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. గూగుల్‌ డేటా సెంటర్‌కు భూ సేకరణ పూర్తి చేసే దిశగా విశాఖ జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. అక్కడ భూములు ఇస్తున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర కంటే పరిహారం ఎక్కువగా ఇవ్వడంతోపాటు, ఎకరాకు 20 సెంట్ల స్థలం, ఒప్పంద ఉద్యోగం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణం, మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+