వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీచ్ ఫెస్టివల్ స్పెషల్ అట్రాక్షన్: కాకినాడకు సల్మాన్, ఏఆర్ రెహమాన్

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకల్లో సంప్రదాయ కళలు, వంటలతోపాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరితో కాకినాడ తీరం సందడిగా మారింది.

ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ హెలికాప్టర్ రైడింగ్‌ను ఏర్పాటు చేసింది.

సల్మాన్, రెహమాన్ సందడి

సల్మాన్, రెహమాన్ సందడి

అయితే, ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బుధవారం హాజరుకావాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల వారు గురువారం బీచ్ ఫెస్టివల్‌లో సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ సంగీత కచేరీని నిర్వహించనున్నట్లు తెలిసింది.

ఆకట్టుకునే కార్యక్రమాలు

ఆకట్టుకునే కార్యక్రమాలు

ప్రతిరోజు రాత్రి 7గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకల్లో ఫ్లవర్ షో, ఆక్వేరియం, ప్యారా రైడింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలతోపాటు బోటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

 సందడిగా ఫెస్టివల్

సందడిగా ఫెస్టివల్

ప్రతిరోజు 200మందితో కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని పర్యాటక శాఖ ఆర్డీ భీమశంకర్ తెలిపారు. స్థానికంగా 45ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు.

ఆకట్టుకుంటున్న ఫెస్టివల్.. ఎమ్మెల్యే బైకాట్

ఆకట్టుకుంటున్న ఫెస్టివల్.. ఎమ్మెల్యే బైకాట్

స్థానిక కళాకారుల ప్రదర్శనలతోపాటు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున ప్రజలు, పర్యాటకులు తరలివస్తున్నారు. తనకు అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కాకినాడ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి ఈ ఫెస్టివల్‌ను బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపించారు.

English summary
The otherwise sleepy Kakinada beach on the city outskirts is bustling with activity following the commencement of three-day annual NTR Beach Festival on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X