వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెమెన్‌కు ఉరి: కలాం గౌరవార్థమంటూ ఏపీవాసుల ఉరి కేసు గుర్తుచేశారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: మరణ శిక్షను వ్యతిరేకించే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం... యూకూబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పైన పునరాలోచన చేయాలని మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.

మెమెన్‌కు ఉరిశిక్షను గురువారం ఉదయం అమలు చేశారు. అంతకుముందు బుధవారం గోపాలకృష్ణ గాంధీ మాట్లాడారు. మరణ శిక్ష పైన న్యాయ కమిషన్ సమాలోచన చేయాలన్నారు. ప్రజాప్రయోజన కారణాలతో ఈ అభ్యర్థన చేస్తున్నట్లు చెప్పారు.

Commute death penalty of Memon to honour Kalam's principles

1997కు ముందు సంబంధించిన కేసును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విధించిన మరణ శిక్షను మహాశ్వేతా దేవి అభ్యర్థన మేరకు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మార్పులు చేశారని గుర్తు చేశారు.

యాకూబ్ మెమెన్‌కు మరణ శిక్ష విధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులూ అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. కాగా, 1997లో ఇద్దరి ఏపీ వారికి మరణ శిక్ష విధించగా.. మహాశ్వేతా దేవి, ఇతరులు పలువురు దానిని రద్దు చేయాలని అభ్యర్థించారు. నాటి రాష్ట్రపతి మార్పులు చేశారు.

English summary
Former Governor Gopalkrishna Gandhi cited a case of 1997 when the then President Shankar Dayal Sharma reversed earlier decision and commuted death penalty of two boys from Andhra Pradesh on the appeal of Mahashweta Devi and other eminent citizens on the eve of their scheduled execution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X