ఎర్ర బుగ్గవాహనం: దిగ్విజయ్ సింగ్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఎర్ర బుగ్గ ఉన్న వాహనం వాడడం ద్వారా దిగ్విజయ్ సింగ్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది.
దిగ్విజయ్ సింగ్‌పై తెలుగు యువత సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎర్ర బుగ్గ ఉన్న కారులో కాన్వాయ్ ద్వారా గురువారంనాడు దిగ్విజయ్ సింగ్ హైదరాబాదులో పర్యటించారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.

తాము ఇప్పటి వరకు ఏ విధమైన కేసు నమోదు చేయలేదని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు - ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులను అడగాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు
అధికారంలో ఉన్నవారు ఎర్రబుగ్గ కార్లను ఇష్టారాజ్యంగా వాడడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు విరుచుకుపడింది. రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు కూడా అధికారిక విధులు నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే అటువంటి వాహనాలు వాడే విధంగా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications