హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసం: మాజీ మంత్రి శైలజానాథ్‌పై సిపికి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ మంత్రి శైలజానాథ్‌ చైర్మన్‌గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్‌ ప్రైవేట్‌ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ కంపెనీకి శైలజానాథ్‌ సమీప బంధువు రమేష్‌ ఎండీగా ఉన్నారని వారు ఫిర్యాదులో ఆరోపించారు. కంపెనీలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు.

Shailajanath

ఆ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కాగా, ఉద్యోగుల ఫిర్యాదుపై శైలజానాథ్‌ స్పందించారు కంపెనీకి గౌరవ హోదాలో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మాట వాస్తవమేనని అయితే, ఆ కంపెనీ తనది కాదని తెలిపారు. కంపెనీ ఎండా రమేష్‌ తన బంధువు కాదని చెప్పారు.

సంస్థలో కొన్ని పరిపాలనాపమైన సమస్యలున్నాయన్నారు. అయినా ఉద్యోగులు ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లిన వారు సైతం ఫీలవుతూ ‘సారీ సార్‌' అని తనకు మెసేజ్‌ పెట్టారని వివరించారు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

English summary
Happy India techmo Corp staff complained against Congress leader and former minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X