కంగ్రాట్స్ డియర్.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్ పై నారా బ్రాహ్మణి పోస్ట్ వైరల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. వారి జాతకాల ప్రకారం మంచి రోజు చూసుకొని మంత్రులుగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఇక ఈరోజు విద్యా, మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్లో ఉన్న తన కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మంత్రి లోకేష్ పై నారా బ్రాహ్మణి పోస్ట్
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కీలక మెగా డీఎస్సీ విధి విధానాల ఫైలు పై తన తొలి సంతకం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. లోకేష్ పై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళు అవాక్కయ్యేలా నువ్వేంటో చూపించావ్
అంతా పల్లెల్లో నుండి అమెరికాకు వెళితే, కానీ అక్కడ చదివి, పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంటు రోడ్లతో, ఎల్ఈడి వెలుగులతో వాటి రూపాలు మార్చేశావని లోకేష్ కు కితాబిచ్చారు. ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా పనిలో పడి అవార్డుల పంట పండించావని బ్రాహ్మణి కొనియాడారు. నీ వ్యక్తిత్వ హననం చేసిన వారు అవాక్కయ్యలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావని బ్రాహ్మణి తన పోస్టులో పేర్కొన్నారు.
కంగ్రాట్స్ డియర్ అంటూ పోస్ట్
సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావని, మీ సమర్థతతో నేటితరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది అంటూ లోకేష్ ను ఉద్దేశించి ఆమె ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది.. కంగ్రాట్స్ డియర్ అంటూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఇక ఈరోజు సచివాలయంలో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీడియోను ఈ పోస్ట్ తో తాను పంచుకున్నారు.
అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో… pic.twitter.com/43S0FzXeDi
— Brahmani Nara (@brahmaninara) June 24, 2024
ఏపీ రాజకీయాలలో బ్రాహ్మణి కీలక భూమిక
గతానికి భిన్నంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణి కూడా కీలక భూమిక పోషించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో బ్రాహ్మణి బయటకు వచ్చి ఆందోళనలు చేసి చంద్రబాబు గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను, చంద్రబాబు సీఎం కావలసిన అవసరాన్ని బ్రాహ్మణి నొక్కి చెప్పారు.
లోకేష్ కోసం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం
అంతేకాదు ఇటీవల జరిగిన ఎన్నికలలో లోకేష్ తరఫున మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార నిర్వహించిన బ్రాహ్మణి ప్రస్తుతం లోకేష్ మంత్రి కావడంతో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం బ్రాహ్మణి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications