కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది: జగన్ పార్టీలోకి 9న ధర్మాన

9న జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలోకి ఎవరు వచ్చినా వద్దనడానికి వీల్లేదని, తనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేరడానికి కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తమను కాదని విభజన నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడం అన్యాయమన్నారు. జిల్లాలో వెనుకబడిన పన్నెండు కులాలు ఓసి జాబితాలో ఉండగా, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చొరవ తీసుకొని వారిని బిసి జాబితాలో చేర్పించారని కొనియాడారు.
రైతు రుణాల మాఫీ అంటూ జనాలను మోసపుచ్చే ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం తాపత్రయం పడుతుండగా, ప్రజల, ప్రాంతాల అవసరాలు, అభివృద్ధికి తాపత్రయపడుతున్న జగన్ పార్టీలో చేరడం మంచిదని భావించానన్నారు. కాగా, ధర్మానతో పాటు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే జగన్నాయకులు కూడా జగన్ వైపు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications