టి అడిగితే ఆంధ్రానా: షర్మిల, జగన్ గేమ్‌ప్లాన్‌పై వ్యాఖ్య

హైదరాబాద్: ప్రజలు తెలంగాణను కోరుకుంటే కాంగ్రెసు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల శనివారం వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాదును ఏ ఒక్కరికో పరిమితం చేయడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ చెందిందన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేసేందుకు మరో ప్రాంతానికి అన్యాయం చేయడమేమిటని ప్రశ్నించారు.

సమైక్యాంధ్రలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు తెలంగాణ అడిగితే కాంగ్రెసు ఇచ్చింది ప్రత్యేక ఆంధ్ర అని విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అమలులో విఫలమైనట్లుగా కూడా ఆమె వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోయామన్నారు.

YS Sharmila

ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు బలంగా ఉన్నాయని, మనం మరింత చురుగ్గా పని చేయాల్సి ఉందని నేతలకు సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పని తీరును పరిశీలిస్తున్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మేలు జరుగుతుందని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పే వారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమ కార్యాచరణ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ సమైక్య ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదిన గుంటూరు - విజయవాడ రహదారిలో రైతు శంఖారావం, 2 విజయవాడలో పార్టీ కో ఆర్డినేటర్ల దీక్ష, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ల ముట్టడి, 10న మండల కేంద్రాల్లో రైతులతో ధర్నా, 17న ఆటోల ధర్నా, 20న మహిళలో ధర్నా చేపట్టనున్నారు. నవంబర్ 1న సమైక్య తీర్మానాలు చేయనున్నారు. గడపగడపకు కాంగ్రెసు, టిడిపి వైఖరిని వెల్లడించేందుకు కరపత్రాలు పంచనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+