వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్యకర్తలే వద్దంటున్నారు, కిరణ్ అన్ని విధాలా: ధర్మాన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
శ్రీకాకుళం: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి అధికారమే ముఖ్యమని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు ఆదివారం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తాము పదవుల కోసం పార్టీని వీడటం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ విభజన పైన తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. విభజన ఆపేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని విధాలా ప్రయత్నాలు చేశారన్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీలకు పోటీగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకు వస్తున్నాయని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ అక్కరలేదని కార్యకర్తలే చెబుతున్నారని ధర్మాన అన్నారు. ఆ పార్టీకి అధికారమే ముఖ్యమైందని, అందుకోసం ఎవరు పిలిస్తే వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమన్యాయం అంటూ వాదన చేయడం సరికాదన్నారు.

కాగా, కాంగ్రెసు పార్టీలో ఉండాలా వద్దా అనే అంశంపై ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళంలో కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ధర్మాన ఏర్పాటు చేసిన ఈ సమావేసానికి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుండి కార్యకర్తలు, ధర్మాన అభిమానులు తరలి వచ్చారు.

English summary

 Former Minister and Congress Party senior MLA Dharmana Prasad Rao on Sunday said Congress is finished in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X