కాంగ్రెస్‌కు 'కాపు' షాక్: వంగవీటి రంగా ఫోటో పెట్టలేదని గందరగోళం
విజయవాడ: బెజవాడలో కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ సభలో ఆదివారం నాడు కొంత గందరగోళం చెలరేగింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు దాని గురించి మాట మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
ఇందులో భాగంగా ఆదివారం విజయవాడలో కాపు రిజర్వేషన్ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. అయితే, సభలో వంగవీటి రంగా ఫోటో లేదని కొందరు ఆందోళనకు దిగారు. వంటవీటి రంగా ఫోటో పెట్టక పోవడాన్ని వారు తప్పుబట్టారు.

దీంతో గందరగోళం ఏర్పడింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కొందరు మీడియా అటెన్షన్ కోసమే హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అంతకుముందు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... కాపులను ఓటు యంత్రాలుగా చూస్తున్నారని విమర్శించారు. టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారిని బీసీల్లో ఎందుకు చేర్చలేదని విమర్శఇంచారు. మా ఉద్యమంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు.












Click it and Unblock the Notifications