వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ వ్యాఖ్య, కాంగ్రెస్ ఆశ: చిరంజీవి, జగన్ కలుస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ పార్టీలోకి పిలుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ పైన, ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ విషయమై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

వైయస్ జగన్.. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టారని, ఆయన ఏనాటికైనా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎన్నోసార్లు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరమేనని చెబుతున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చాక... వైసిపి ప్రతిపక్ష పార్టీగా మిగిలింది. కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల (2019) నాటికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే దిశలో పావులు కదుపుతోంది.

Congress may invite Pawan Kalyan and YS Jagan

ఇందులో భాగంగా టిడిపి, వైసిపిలకు కౌంటర్‌గా.. ప్రత్యేక హోదా, ప్రజల సమస్యల పైన స్పందిస్తూనే, జగన్‌ను తన పార్టీలో చేర్చుకునే విషయమై కూడా ఆశగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కూడా ఆ దిశలోనే ఉన్నాయి.

మరోవైపు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి కానున్నారనే ప్రచారం కూడా ఉంది. అదే నిజమైతే.. ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపి చేయిచ్చి అన్నయ్యకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అన్నయ్యకు అవసరం వచ్చినప్పుడు నేను ఎలా ఆదుకుంటానే నాకే తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ కోణంలోనే చూస్తున్నారని చెప్పవచ్చు.

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమిడేనా?

ఓ వైపు జగన్‌ను ఆహ్వానిస్తామని, మరోవైపు పవన్ కళ్యాణ్ అన్యయ్య కోసం మద్దతు పలుకుతారనే ఊహాగానాల నేపథ్యంలో.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడుతాయా అనే చర్చ సాగుతోంది. జగన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోరు.

మరోవైపు, అన్నయ్యకు ఆ పదవి లేకుండా పవన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితులే కనిపించవు. ఈ నేపథ్యంలో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అంటున్నారు. అసలు కాంగ్రెస్ గురించి జగన్ ఆలోచించడమే లేదని, ఇది అనవసరమైన వాదన అనే వారు కూడా లేకపోలేదు.

English summary
Will Pawan Kalyan support Congress for his brother?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X