టీడీపీ తర్వాత.. 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది శాసన సభ్యులు ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ ప్రతిపాదన పెట్టారు. దీంతో సభాపతి వారిని ఒకరోజు సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన వారిలో.. డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్, కృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గీతా రెడ్డి, జీవన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, భాస్కర రావు, రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సస్పెండైన అనంతరం సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన వారు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించారు. కాగా, ఇప్పటికే పదిమంది టీడీపీ సభ్యులు వారం రోజుల పాటు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.

కాగా, అంతకుముందు, ప్రశ్నోత్తరాలకు అడ్డు తగులుతున్న కాంగ్రెస్ సభ్యులపై హరీష్ రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాలను చేపడదామని బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చెప్పారని, ఇప్పుడేమో ప్రశ్నోత్తరాలు వద్దు, తమ వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ జానారెడ్డి పట్టుబడుతున్నారన్నారు. బీఏసీలో ఓకే అన్న తర్వాత ఇప్పుడు వద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉందన్నారు.
ఇందిరా పార్క్ వద్ద టీడీపీ ధర్నా
తెలంగాణ తెలుగుదేశం పార్టీ, రైతు ఆత్మహత్యలకు సంబంధించి సర్కారుపై ప్రత్యక్ష పోరుబాటకు దిగింది. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలతో కలిసి ఆ పార్టీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు.
రైతు సమస్యలపై సర్కారు ఉదాసీన వైఖరి నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వ వైఖరిని నేతలు ఖండిచారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై ఈరోజు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications