అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజనపై ఏ ఒక్కరూ నోరుమెదపలేదు, హైద్రాబాద్ పై బాబు ఆసక్తికరం

రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి:రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన విమర్శించారు.

విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్ లో చేపట్యటిన నవనిర్మాణ దీక్షలో మూడో రోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష, మహసంకల్పం కార్యక్రమాలను చేపట్టింది.

వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది కోసం ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టిందనే విషయాలపై ప్రజలకు వివరించనుంది.

అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం ఏ రకంగా ఉంది. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కూడ వివరించనున్నారు.రాజకీయంగా విపక్షాలు తమపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడ టిడిపి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొంటుంది.

రాష్ట్ర అవతరణ కూడ జరుపుకోలేని పరిస్థితి

రాష్ట్ర అవతరణ కూడ జరుపుకోలేని పరిస్థితి

రాష్ట్ర అవతరణ కూడ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.అంతేకాదు కష్టాల్లో కూడ ఉన్నామన్నారు. ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు.గత చరిత్రను నెమరువేసుకొంటే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో అవగాహన వస్తోందన్నారు బాబు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలిగితేనే అభివృద్దివైపు వెళ్ళగలుగుతామన్నారు బాబు.

ఇతర రాష్ట్రాలతో పోటీపడి హైద్రాబాద్ అభివృద్ది

ఇతర రాష్ట్రాలతో పోటీపడి హైద్రాబాద్ అభివృద్ది


ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైద్రాబాద్ ను అభివృద్ది చేసినట్టు చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. హైద్రాబాద్ ను నాలెడ్జ్ హబ్ గా తయారుచేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. దక్షిణ భారతదేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని బాబు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలపై కపట ప్రేమ

కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలపై కపట ప్రేమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపుతోందని ఆయన విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు చంద్రబాబునాయుడు.రాజకీయలబ్దికోసమే ఆనాడూ తమ పొట్టకొట్టారని బాబు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఏపీ ప్రజలను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. ఏపీని అన్యాయంగా విభజించారని చెప్పారు.

న్యాయం చేయాలని అందర్ని కోరా

న్యాయం చేయాలని అందర్ని కోరా

రాష్ట్ర విభజన సమయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.న్యాయం చేయాలని అందరినీ కోరినట్టు చెప్పారు. అధికారం ఉందని రాష్ట్రాన్ని ఇష్టంవచ్చినట్టు విభజించారని మండిపడ్డారు.పార్లమెంట్ తలుపులు మూసి బిల్లును ఆమోదించారన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం పై ఏ ఒక్క నేత మాట్లాడలేదని చంద్రబాబు ఆరోపించారు.

English summary
Congress party bifurcate united Andhra pradesh for political benefit alleged Ap chief minister Chandrababu naidu on Sunday.he participated navanirma dheeksha sabha 3rd day in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X