బాబు పప్పులుడకవ్, దాటవేత: చిరు ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు వంద రోజుల పాలనలో 101 పర్యాయాలు మాట మార్చారని, అబద్దాలు చెప్పారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సోమవారం ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో అర చేతిలో వైకుంఠం చూపించారన్నారు. ‘డాబుల బాబు - వంద రోజుల పాలన'పై రూపొందించిన వాస్తవ పత్రాన్ని రఘువీరా రెడ్డి సోమవారం ఇందిరా భవన్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, హీరో చిరంజీవి, ఎంపీ కెవిపి రామచంద్ర రావు, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సీ రామచంద్రయ్య, కౌన్సిల్‌లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ వంద రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 నుంచి 60కి పెంచడం మినహా చేసిందేమి లేదన్నారు.
బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మాట మార్చారని, అనేక మెలికలు తిప్పుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు కొత్తగా రుణాలు ఇవ్వలేదన్నారు. క్రాప్ హాలీ-డే తరహాలో లోన్ హాలీ-డే ప్రకటించేశారని విమర్శించారు. ఎపిపిఎస్‌సి ద్వారా ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, ఆదర్శ రైతులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే 101 ఉన్నాయన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు.

ఏపీ కాంగ్రెస్
మంత్రివర్గంలో ఎస్‌సి, ఎస్‌టిలకు సముచిత ప్రాధాన్యం కల్పించకుండా, పెట్టుబడిదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారని రఘువీరా రెడ్డి విమర్శించారు.

ఏపీ కాంగ్రెస్
ముఖ్యమంత్రి పేషీలో ఒఎస్‌డి అభీష్టను నియమించారని, అభీష్ట ఎవరో మంత్రులకే తెలియదని రఘువీరా అన్నారు. మంత్రివర్గ సమావేశంలో సలహాదారులనూ కూర్చోబెట్టుకుంటున్నారని, లేక్‌వ్యూ అతిథి గృహంలో, సచివాలయంలో ఎపి రాజధాని కోసం హుండీలను ఏర్పాటు చేసి, కొన్ని గంటల్లోనే ఎత్తివేశారన్నారు.

ఏపీ కాంగ్రెస్
బిజెపితో స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారని, మరోవైపు బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉచిత విద్యుత్తు ఇవ్వడం శ్రేయస్కరం కాదని అన్నారని, ప్రజలేమో హామీల బండి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.

ఏపీ కాంగ్రెస్
ఆ బండికి ఒక ఎద్దు ఒకవైపు, మరో ఎద్దు రెండో వైపు లాగుతున్నదని రఘువీరా రెడ్డి అన్నారు. తాము అధికారంలో ఉన్న 3500 రోజుల్లో సిమెంట్ ధర బస్తాకు 70 రోజులు పెంచితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వంద రుపాయలు పెరిగిందని ఆయన ఉదహరించారు.

ఏపీ కాంగ్రెస్
ధరల స్థీరీకరణ ఏదని ప్రశ్నించారు. ఇది పరిపాలనా? ప్రైవేటు జాగారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పప్పులు ఇక ఉడకవని రఘువీరా అన్నారు. వంద రోజుల్లో ఇదా మీరు సాధించింది అని ఆయన ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, వచ్చే ఐదేళ్ళలో ఏమి ఒరగబెడతారో చెప్పండి అని అన్నారు.

ఏపీ కాంగ్రెస్
సినిమా స్కోప్‌లో ఇంత కాలం విజన్ డాక్కుమెంట్ చూపించారని విమర్శించారు. 13 జిల్లాల్లో 14 విమానాశ్రయాలు నిర్మిస్తారట అని ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగురలేనమ్మ, స్వర్గానికి ఎదురుతానన్నట్లు పాలన ఉందన్నారు.

ఏపీ కాంగ్రెస్
బాబు పాలనపై నందిగామ ఉప ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకోవచ్చా? అని ప్రశ్నించగా, దీనిపై ఫలితాలు వచ్చిన తర్వాతే తాను స్పందిస్తానని రఘువీరా దాట వేశారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలూ బాధ్యత తీసుకోవాలని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

విశాఖ కాంగ్రెస్
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న మోసాలపై ఇక నిరంతరం పోరాటం సాగిస్తామని, కాంగ్రెసు పార్టీ ప్రజల పక్షానే ఉంటుందని మాజీ మంత్రి పీ బాలరాజు విశాఖలో అన్నారు.

విశాఖ కాంగ్రెస్
సోమవారం సాయంత్రం విశాఖ నగర కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో టీడీపీ వైఫల్యాలకు సంబంధించి పీసీసీ రూపొందించిన శ్వేతపత్రాన్ని బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications