17 మంది రెబెల్స్ సస్పెన్షన్: స్రవంతి రెడ్డి కూడా..

Congress suspends 17 rebels in Telangana
హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్లు ఉపసంహరించుకోనటువంటి తిరుగుబాటు అభ్యర్థులను కాంగ్రెసు నాయకత్వం సస్పెండ్ చేసింది. టికెట్లు రాకపోవడంతో 17 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. వారిపై కాంగ్రెసు నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెసు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్వరంతి రెడ్డి కూడా సస్పెన్షన్‌కు గురైనవారిలో ఉన్నారు. మునుగోడు నుంచి ఆమె తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈ సీటును కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది. స్రవంతి రెడ్డి పోటీపై కాంగ్రెసు అధిష్టానం నేత జైరాం రమేష్ పాల్వాయి ఇంటికి వెళ్లి హెచ్చరించారు. అయినా స్రవంతి రెడ్డి వెనక్కి తగ్గలేదు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తున్న జనగామ శాసనసభ సీటులో కూడా తిరుగుబాటు అభ్యర్థి రంగంలో ఉన్నారు.

అలాగే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభా నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా సస్పెన్షన్‌కు గురైనవారిలో ఉన్నారు. ఈ సీటును కూడా కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది. అయితే, మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెసు బీ ఫారం ఇచ్చింది. మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా చెప్పారు. కానీ మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ నుంచి తప్పుకోలేదు.

సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెసు రెబెల్స్ వీరే...

- సిరాజ్ అమీనాఖాన్(ఆదిలాబాద్)
- చిలుమల శంకర్(బెల్లంపల్లి)
- కౌశిక్ హరినాథ్(రామగుండం)
- ఇనుగాల భీంరావు(హుజూరాబాద్)
- జువ్వాది నర్సింగరావు(కోరుట్ల)
- కర్రె జంగయ్య, తూము ఎల్లారావు(కూకట్‌పల్లి)
- అరుణతార (జుక్కల్)
- ఖాజీంఖాన్ (యాకత్‌పూరా)
- పి.నర్సింహారెడ్డి, ఆర్.రవీందర్‌రెడ్డి (నారాయణ్‌పేట్)
- సుగురప్ప(మక్తల్)
- కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి)
- మల్‌రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం)
- పాల్వాయి స్రవంతి (మునుగోడు)
- బక్కాజడ్సన్ (జనగాం)
- లక్ష్మీనారాయణ నాయక్(పాలకుర్తి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+