చార్మినార్‌ని మారుస్తారా: కేసీఆర్‌పై వీహెచ్, పదవిలో ఉండరు: పొన్నం
హైదరాబాద్: వాస్తు పేరుతో సచివాలయాన్ని తరలిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సచివాలయ మార్పు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ గురువారం దుయ్యబట్టింది.
సచివాలయ మార్పును వ్యతిరేకిస్తూ ఈ నెల ఏడున గాంధీ భవన్ నుండి రాజ్ భవన్ వరకు నిరసన చేపడతామని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మార్పును ఉపసంహరించుకునే వరకు పోరాడుతామన్నారు. తెలంగాణను గౌరవించేలా కేసీఆర్ మాట్లాడాలన్నారు.
తెలంగాణ వచ్చే వరకు ఢిల్లీ నుండి తిరిగి రానని నాడు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోను అదే చెప్పలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అన్నారు. కేసీఆర్ ఎక్కువ రోజులు పదవిలో ఉండరన్నారు.

ప్రభుత్వ ఆస్తులు అమ్మాలనుకోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ పైన కేసీఆర్ కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. బీజేపీ బండారం క్రమంగా బయటపడుతోందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.
ఢిల్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు రెఫరెండం కాదని చెప్పడం బీజేపీ భయాన్ని తెలియజేస్తోందన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని అడగాలన్నారు. వాస్తు కోసం సచివాలయాన్ని మారుస్తున్న కేసీఆర్.. చార్మినార్ వాస్తు బాగా లేదని కూడా మారుస్తారేమో అన్నారు.
తెలంగాణ వ్యతిరేకులను చేరదీస్తున్నారు: ఎర్రబెల్లి
కేసీఆర్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చేరదీస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తలసాని, తుమ్మల తదితరులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే అన్నారు. ఇలా చేస్తే కేసీఆర్‌ను ప్రజలు తరిమికొడతారన్నారు. ఈ నెల 12న వరంగల్ జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో 15వేల మంది పాల్గొనే అవకాశం కల్పించామన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications