తెరాసతో పొత్తుకు కాంగ్రెసు యత్నం: కెకెకు ఫోన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. విలీనంపై కెసిఆర్ ఇష్టమని, పొత్తుల ఖరారుకు తెరాస కమిటీ వేయడాన్ని స్వాగితిస్తున్నామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అలాగే, కెసిఆర్‌పై గానీ తెరాసపై గానీ విమర్శలు చేయవద్దని ఆయన పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులకు సర్ది చెప్పారు.
తెరాసతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతోనే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలకు ఆ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దిగ్విజయ్ సింగ్ తెరాస నేత కె. కేశవ రావుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. పొత్తుల ఖరారుకు తెరాస కేశవ రావు నేతృత్వంలో కమిటీ వేసింది. దీంతో ఆయన కెకెకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.

కాగా, కేశవ రావు కాంగ్రెసుకు రాజీనామా చేసి, తెరాసలో చేరారు. ఆయనకు కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దానివల్ల తెరాసతో పొత్తు చర్చలు జరపడం కూడా కాంగ్రెసుకు సులభమవుతుంది. జైరాం రమేష్ కూడా తెరాసపై విమర్శలను తగ్గించారు. ఆయన బుధవారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు.
తెరాసతో పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామని కాంగ్రెసు అధిష్టానం నాయకులు చెబుతున్నారు. తాజాగా వెలువడిన సర్వేలో తెరాస, కాంగ్రెసు విడివిడిగా పోటీ చేసినా కాంగ్రెసుకు లోకసభ స్థానాలు బాగానే వస్తాయని తేలింది. తెరాసతో సమానంగా కాంగ్రెసుకు లోకసభ స్థానాలు వస్తాయని తేలింది. దాంతో తెలంగాణ ప్రాంత నాయకులు కాస్తా ఆనందంగానే ఉన్నారు .












Click it and Unblock the Notifications