ఆశ్చర్యపోయా, కెసిఆర్ఉంటే: చిరు, టిడిపిలోకి మాగుంట

సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తప్పనిసరిగా వస్తుందన్నారు. టిక్కెట్ల కోసం నేతల పోటీ చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. కాంగ్రెసు పార్టీ బడుగు, బలహీనవర్గాలకు ఎంతో చేసిందన్నారు. రాష్ట్రం విడిపోకుంటే పోలవరం ప్రాజెక్టును తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రానివ్వక పోయే వారన్నారు. కాంగ్రెసు పార్టీ అంటే ఒకే సామాజికవర్గం అన్న అభిప్రాయం పోవాలన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలోను డమ్మీ అభ్యర్థి ఉన్నారని సీమాంధ్ర పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. సీమాంధ్రలో 1600 దరఖాస్తులు వచ్చాయని, కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందనే వారికి ఇదే సమాధానం అన్నారు. గతంలో ఎప్పుడు ఇంతలా దరఖాస్తులు రాలేదన్నారు.
టిడిపిలో చేరిన మాగుంట
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశాక తాను రాజకీయాల్లో కొనసాగడంపై సందిగ్ధంలో ఉన్నానని, అలాంటప్పుడు చంద్రబాబు పిలిచి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారన్నారు. టిడిపి-బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications