వైసీపీ నేతల పేర్లు చెప్తావా లేదా ? సిట్ కస్టడీలో కానిస్టేబుల్ పై దాడి ? డీజీపీకి లేఖ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ అధికారులు విచారణలో భాగంగా ఓ కానిస్టేబుల్ ను వేధింపులకు గురి చేసి దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సదరు కానిస్టేబుల్ డీజీపీ హరీష్ గుప్తాకు పూర్తి వివరాలతో రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ నేతల్ని ఎలాగైనా ఇరికించాలని సిట్ చూస్తోందా అన్న చర్చ మొదలైంది.
గతంలో పదేళ్ల పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్ మెన్ గా పనిచేసిన మదన్ అనే కానిస్టేబుల్ ను లిక్కర్ స్కాం విచారణలో భాగంగా పిలిచిన సిట్ అధికారులు టార్చర్ పెట్టారని అతను ఆరోపించాడు. వైసీపీ నేతలకు, ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆతనిపై దాడి చేసినట్లు తెలిపాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తనను కొట్టారంటూ గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఫోటోల్ని కూడా అతను డీజీపీకి పంపాడు.

తన మొహం మీద, వీపు మీద సిట్ అధికారులు పిడిగుద్దులు గుద్దినట్లు అతను ఆరోపించాడు. చేతి వేళ్ళు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారని తెలిపాడు. సిట్ అధికారుల టార్చర్ ని క్షుణ్ణంగా వివరిస్తూ డిజిపి కి కానిస్టేబుల్ మదన్ లేఖ రాశాడు. సిట్ దెబ్బలతో తాను 6 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నట్లు అతను వివరించాడు. 200-250 కోట్లు డబ్బులు రవాణా చేసినట్టు స్టేట్ మెంట్ ఇవ్వాలని తనను సిట్ అధికారులు వేధించినట్లు మదన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఘటనపై వైసీపీ మండిపడింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, వైయస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు యత్నిస్తున్నారన్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్‌ని చిత్రహింసలు పెట్టారన్నారు. కానిస్టేబుల్ మదన్ ని తప్పుడు వాగ్మూలం కోసం సిట్ పోలీసులు కొట్టారని, దీనిపై అతను డీజీపీకి ఫిర్యాదు చేశాడన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్తున్నామన్నారు.
ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డితో పాటు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరిని ఇప్పటికే సిట్ అధికారులు పలుమార్లు విచారించారు. ఇందులో లభించిన సమాచారం ఆధారంగా మద్యం కేసులో డబ్బులు ఎవరెవరికి వెళ్లాయన్న వివరాలు రాబ్టటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ను తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేదింపులకు గురి చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications