వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి అనుమానం, జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు, ఎన్టీఆర్ స్పూర్తే: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:చివరి రోజు వరకు కేంద్రంపై అవిశ్వాసం విషయంలో ఇదే స్పూర్తితో పోరాటాన్ని కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆగష్టు సంక్షోభం సమయంలో ఆనాడు ఎమ్మెల్యేలు ఏ రకంగా మూకుమ్మడిగా టిడిపికి అండగా నిలిచారో ప్రస్తుతం ఎంపీలు కూడ అదే స్పూర్తిని కొనసాగిస్తున్నారని బాబు చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఉదయం పూట టిడిపి ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబునాయుడు పార్టీ ఎ:పీలకు దిశానిర్ధేశం చేశారు.

కేంద్రంపై అవిశ్వాసం విషయంలో చివరి వరకు పోరాటాన్ని కొనసాగించాలి చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను కోరారు . అవిశ్వాసం విషయంలో ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబునాయుడు కోరారు.

ఆగష్టు సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు అండగా నిలిచారు

ఆగష్టు సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు అండగా నిలిచారు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించిన ఆగష్టు సంక్షోభం సమయంలో 161 మంది ఎమ్మెల్యేలు ఆనాడు ఎన్టీఆర్‌కు అండగా నిలిచారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడ టిడిపి ఎంపీలు అదే రకమైన పోరాట స్పూర్తిని కొనసాగిస్తున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు వరకు కూడ ఇదే స్పూర్తిని కొనసాగించాలని బాబు పార్టీ ఎంపీలను కోరారు.

బిజెపి అనుమానాలను పెంచుకొంది

బిజెపి అనుమానాలను పెంచుకొంది

కొంత కాలంగా బిజెపి రాష్ట్రంలోని టిడిపిపై అనుమానాలను పెంచుకొందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అయితే బిజెపి అనుమానాలకు కారణాలేమిటనే విషయాన్ని బాబు ప్రస్తావించలేదు రాష్ట్ర అవసరాలే తమకు ముఖ్యమని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని బాబు చెప్పారు.

పోలవరంలో చేతులు పెడితే కాలుతాయి, బిజెపి మోసం, ఏపీపై పగ: చంద్రబాబు సంచలనం పోలవరంలో చేతులు పెడితే కాలుతాయి, బిజెపి మోసం, ఏపీపై పగ: చంద్రబాబు సంచలనం

జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు

జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు

తనకు జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కొన్ని రోజులుగా తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయనున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు తాను లక్ష్యంగా పెట్టుకొన్నట్టు బాబు చెప్పారు. జాతీయ రాజకీయాల విషయాలపై తనకు ఆసక్తి లేదన్నారు.

టిడిపిని ఇబ్బందిపెట్టే చర్యలు

టిడిపిని ఇబ్బందిపెట్టే చర్యలు

రాష్ట్రంలో టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందని బాబు పార్టీ ఎంపీలతో చెప్పారు. అవిశ్వాసానికి బిజెపి మినహ అన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

ఏపీ సమస్య జాతీయ సమస్యగా మారింది

ఏపీ సమస్య జాతీయ సమస్యగా మారింది

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చేస్తున్న పోరాటం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.జాతీయ పార్టీలు కూడ ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సానుభూతిగా ఉన్నారని బాబు గుర్తు చేశారు. మరో వైపు తనకు ఎవరిపై ద్వేషం, కోపం లేదని చంద్రబాబునాయుడు చెప్పారు.వైసీపీదీ లాలూచీ రాజకీయమని బాబు చెప్పారు.

English summary
AP CM Chandrababu Naidu ordered to MPs to continue their struggle with the same inspiration on the union government till the last day of parliament.chandrababunaidu conducted teleconference with tpd mps on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X